IND Vs AUS Womens Test:అస్ట్రేలియాపై భారత మహిళల ఘన విజయం, 8 వికెట్ల తేడాతో ఆసీస్ పై గెలుపు

భారత మహిళ క్రికెట్ జట్టు అస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది.  ముంబై వాంఖడే స్టేడియంలో  అస్ట్రేలియాను భారత మహిళా జట్టు ఓడించింది.  

Wankhede erupts again! Fans sing Vande Mataram as India (W) record maiden win over Australia lns

ముంబై:  అస్ట్రేలియాతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ లో  భారత మహిళా క్రికెట్ జట్టు  అస్ట్రేలియాపై విజయం సాధించింది. భారత్, అస్ట్రేలియా జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ మాత్రమే ఉంది.  అస్ట్రేలియాపై బారత జట్టు విజయం సాధించి  చరిత్ర సృష్టించింది.

భారత మహిళా క్రికెట్ జట్టు  బ్యాటింగ్ , బౌలింగ్ లలో  రాణించింది.  28 పరుగులకే  ఐదు వికెట్లు పడగొట్టి  అస్ట్రేలియా జట్టు పతనానికి భారత క్రికెట్ జట్టు బౌర్లు కీలక పాత్ర పోషించారు. 75 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత మహిళా జట్టు చేధించింది.  అస్ట్రేలియాపై   ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో  ఆదివారంనాడు భారత మహిళా క్రికెట్ జట్టు విజయం సాధించింది.

 

అస్ట్రేలియాపై  భారత మహిళా జట్టు విజయం సాధించడంతో  భారత క్రికెట్ జట్టు అభిమానులు సందడి చేశారు.   స్టాండ్స్ లో వందేమాతం పాడారు.  దీంతో సోషల్ మీడియా ఎక్స్ లో ఈ వీడియో వైరల్ గా మారింది.  అస్ట్రేలియా జట్టుపై  భారత మహిళా జట్టు విజయం సాధించడంతో  భారత జట్టును  పలువురు అభినందనల్లో ముంచెత్తారు. 

 

1995 తర్వాత  స్వదేశంలో పలు టెస్టులు  ఆడిన భారత జట్టు  తప్పులు చేయలేదు.  అస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి బలమైన జట్లకు  భారీ లక్ష్యాలను కూడ నిర్ధేశించారు.

 

వాంఖడే, డి.వై. పాటిల్ స్టేడియాల్లో  ఇంగ్లాండ్ తో జరిగిన రెండు టెస్టులలో  భారత జట్టు స్థిరమైన ప్రదర్శన సాధించింది.   ఇంగ్లాండ్ పై  భారత మహిళా క్రికెట్ జట్టు విజయం సాధించింది.  టెస్టు క్రికెట్ లో అత్యధిక పరుగుల తేడాతో  ఇంగ్లాండ్ పై భారత జట్టు విజయం సాధించింది.  అస్ట్రేలియాతో జరిగిన 11 టెస్టు మ్యాచ్ ల్లో  భారత సాధించిన తొలి విజయం.  భారత మహిళా క్రికెట్ జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉందని  క్రీడా నిపుణులు ప్రశంసిస్తున్నారు.  

గత వారం ఇంగ్లాండ్ పై భారత జట్టు విజయం సాధించింది.  జెమిమా రోడ్రిగ్స్, శుభా సతీష్, రేణుకా సింగ్ ఠాకూర్ లు టెస్టుల్లో స్టార్ ఆటగాళ్లుగా మారారు. అస్ట్రేలియాతో జరిగిన  మ్యాచ్ లో  52 పరుగులు చేసిన   రిచా ఘోస్ అందరి దృష్టిని ఆకర్షించారు. 

 

టెస్టు మ్యాచ్ నాలుగో రోజున స్నేహ రాణా (5-2-9-2), రాజేశ్వరి గైక్వాడ్ (1.4-1-0-2), దీప్తి శర్మ (3-3-5-0) బౌలర్లు రాణించడంతో  అస్ట్రేలియాను  నియంత్రించగలిగారు.  భారత్ పై  భారీ ఆధిక్యాన్ని సాధించాలనే పట్టుదలతో   ఇన్నింగ్స్ ప్రారంభించిన అస్ట్రేలియాకు  చిక్కుల్లో పడింది.  ఆట ప్రారంభమైన  45 నిమిషాల్లో ఐదు వికెట్లు కోల్పోయి  భారత్ కు  వైపునకు మ్యాచ్ టర్న్ అయ్యేలా చేసింది. 

 

 

ఓవర్ నైట్  233/5 పరుగల స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన  అస్ట్రేలియా జట్టు  261 పరుగులకే  కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్ లో  స్నేహ రాణా నాలుగు వికెట్లు తీసింది.

అస్ట్రేలియా జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో  219 పరుగుల స్కోరు  చేసింది.  రెండో ఇన్నింగ్స్ లో  261 పరుగులకే అలౌటైంది.  భారత మహిళా క్రికెట్ జట్టు  తొలి ఇన్నింగ్స్ లో  406 పరుగుల స్కోరు చేసింది. టెస్టుల్లో అస్ట్రేలియాపై భారత జట్టు అత్యధిక స్కోరును నమోదు చేసింది. 

షఫాలి వర్మ తొలి బంతిని ఫోర్ కొట్టి ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. గార్త్ అద్భుతమైన బంతితో షఫాలిని పెవిలియన్ కు పంపారు.  షఫాలి బ్యాట్ ను తాకుతూ  స్కిప్పర్ అలిస్సా హీలి చేతిలో బంతి పడిది.  బెత్ మూనీ గార్డనర్  ఓ క్యాచ్  వదిలేయడంతో  రిచా ఘోష్ ఔటయ్యే ప్రమాదం నుండి బయటపడింది. తొలి ఓవర్ లో షఫాలి వర్మ నాలుగు పరుగులకే ఔటైన తర్వాత ఘోష్ మంధాన 61 బంతుల్లో  38 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.  రెండో వికెట్ కు  51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios