కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ భారత్ లోనూ విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ నడుస్తోంది. ఈ కరోనా వైరస్ తో క్రీడా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ జరగాల్సిన అన్ని క్రీడలు ఆగిపోయాయి.

దీంతో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లోనే కుటుంబసభ్యులతో గుడుపుతూ కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టారు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్కతో సరదాగా గడుపుతూనే.. ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టారు. ఇటీవల జిమ్ లో కసరత్తులు చేస్తూ.. వీడియో షేర్ చేసిన కోహ్లీ తాజాగా.. మరో వీడియో షేర్ చేశారు. ఈ వీడియోకి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

 

ప్రస్తుతం మ్యాచ్ లు లేకపోయినా.. కోహ్లీ కసరత్తులు చేస్తూ.. తన ఫిట్నెస్ ని కొనసాగిస్తున్నాడు. కాగా.. లాక్ డౌన్ సడలింపులతో జూన్ నుంచి మళ్లీ క్రికెట్ మ్యాచ్‌లు ఆరంభమయ్యే సూచనలు కనిపిస్తుండగా.. దొరికిన ఈ బ్రేక్ టైమ్‌లో కోహ్లీ ఫిట్‌నెస్ మరింత మెరుగుపడినట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకూ జిమ్‌లో బరువులు ఎత్తుతూ సహచర ఆటగాళ్లకి సవాల్ విసిరిన విరాట్ కోహ్లీ.. తాజాగా క్లిష్టతరమైన 180 డిగ్రీ ల్యాండింగ్ ఎక్స్‌ర్‌సైజ్‌లతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కాలి మడమపై శరీరం బరువు మొత్తాన్ని మోపి.. ఆ తర్వాత 180 డిగ్రీ కోణంలో గాల్లోకి ఎగిరి మళ్లీ ఒంటి కాలి మడమపై ల్యాండ్ అవడం చాలా కష్టం. 

ఈ క్రమంలో.. సరైన ప్రాక్టీస్ లేకపోతే గాయపడే ప్రమాదాలు లేకపోలేదు. ముఖ్యంగా.. అథ్లెట్స్‌కి పాత మడమ గాయాలేమైనా ఉంటే..? అవి తిరగబడే ఛాన్స్ ఉంది. అందుకే.. ఈ ల్యాండింగ్‌ని టాప్ ఎక్సర్‌ సైజ్‌గా కోహ్లీ పేర్కొన్నాడు. కాగా.. కోహ్లీ ఈ వీడియోకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

నువ్వు గ్రేట్ విరాట్ బాయ్ అంటూ కొందరు.. నువ్వెప్పుడూ మాలో స్ఫూర్తి నింపుతావు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.