డ్రెస్సింగ్ రూమ్‌లో గడిపిన చివరి రోజు అనుభవాలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆర్‌సీబీ...విరాట్ కోహ్లీ ప్రవర్తనను ట్రోల్ చేస్తున్న క్రికెట్ అభిమానులు...ఏబీ డివిల్లియర్స్ నుంచి కోహ్లీ నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ కామెంట్లు...

IPL 2020 సీజన్‌ను నాలుగో స్థానంతోనే ముగించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... దుబాయ్ నుంచి స్వదేశానికి పయనమైంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో గడిపిన చివరి రోజు అనుభవాలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది ఆర్‌సీబీ.

ఈ వీడియోలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2020 కోచ్ సిమోన్ కటిచ్‌తో పాటు విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ మాట్లాడారు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేన్ విలియంసన్ కొట్టిన భారీ షాట్‌ను బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ పట్టుకోవడంలో విఫలమైన దేవ్‌దత్ పడిక్కల్‌ను ట్రోల్ చేస్తూ కనిపించాడు విరాట్ కోహ్లీ.

సీజన్‌లో ఎన్నో ఈజీ క్యాచ్‌లను జారవిడిచిన కోహ్లీ, బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఎలా పట్టుకోవాలో పడిక్కల్‌కి వివరిస్తూ కనిపించాడు. ఆర్‌సీబీ అభిమానులకు క్షమాపణలు చెప్పాడు ఏబీడీ. ‘ఆర్‌సీబీ అభిమానులందరికీ మీ సపోర్టుకి ధన్యవాదాలు. టోర్నమెంట్ అంతా మాకు తోడుగా నిలిచారు మీరు. ఈ సారి టైటిల్ గెలవలేకపోయినందుకు క్షమాపణలు కోరుతున్నా...’ అంటూ చెప్పాడు ఏబీడీ.

Scroll to load tweet…

ఎలిమినేటర్ మ్యాచ్‌లో కూడా హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు ‘మిస్టర్ 360’. బ్యాటింగ్‌లో ఫెయిల్ అయిన ఆర్‌సీబీ, ఒక్క కేన్ విలియంసన్ క్యాచ్ పట్టుకుని ఉంటే గెలిచేదని కోహ్లీ గుడ్డిగా వాదించడం అతని మానసిక పరిణితికి నిదర్శనమని అంటున్నారు అభిమానులు.