విరాట్ కోహ్లీ కౌగిలితో జైలుకు.. బయటకువచ్చిన అభిమానికి ఘనస్వాగతం.. వైరల్ వీడియో !
Virat Kohli: భారత్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండిలోకి దూకి విరాట్ కోహ్లీని కౌగిలించుకున్నాడు ఒక అభిమాని. భద్రతా ఉల్లంఘనకు పాల్పడినందుకు జైలు పాలయ్యాడు. అయితే, కోహ్లీ అభిమాని జైలు నుంచి బయటకు రాగా అతనికి పెద్ద పూలదండలతో ఘనస్వాగతం లభించింది.
Virat Kohli Fan Viral Video: జైలు నుంచి బయటకు వచ్చిన విరాట్ కోహ్లీ అభిమానికి పెద్దపెద్ద పూల దండలతో ఘనస్వాగతం లభించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య హోల్కర్ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో వింత సంఘటన చోటు చేసుకుంది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో మైదానం భద్రతను బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ అభిమాని కింగ్ కోహ్లీని దగ్గరకు వెళ్లి తన అభిమానం చాటుకున్నాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీని కౌగిలించుకున్నాడు. ఈ క్రమంలోనే అక్కడికి ఎంట్రీ ఇచ్చిన సెక్యూరిటీ.. విరాట్ అభిమానిని గ్రౌండ్ నుంచి అదుపులోకి తీసుకున్నారు. భద్రతా ఉల్లంఘనకు పాల్పడినందుకు అతన్ని పోలీసులకు అప్పగించడంతో జైలుపాలయ్యాడు.
అయితే, ఒకరోజు జైలులో ఉంచిన కోహ్లీ అభిమానిని పోలీసులు వదలిపెట్టారు. అయితే, విరాట్ కోహ్లీ అభిమాని బయటకు రాగ అతనికి జైలు వద్ద పెద్ద పూల దండలు, పలువురు కోహ్లీ అభిమానులు ఘనస్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. జైలు నుంచి బయటకు వచ్చిన విరాట్ కోహ్లీ అభిమాని స్పందిస్తూ.. తనకు కోహ్లీ అంటే చాలా ఇష్టమనీ, అందుకే మైదానం భద్రతతో సంబంధం లేకుండా అతడిని కౌగిలించుకునే సాహసం చేశానని చెప్పాడు. ఈ వీడియో కూడా వైరల్ గా మారింది. పోలీసులు అరెస్టు చేసి అనంతరం విడుదల చేసిన యువకుడు స్వగ్రామానికి తిరిగి రాగా ఆయనకు ఘనస్వాగతం లభించింది. కోహ్లీ ఓ అభిమానికి స్వాగతం పలికిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వారిలో ఒకరు ఆయనపై పూల మాల వేయడం కనిపించింది.
అందరూ చూస్తుండగానే.. విరాట్ కోహ్లీ కౌగిలితో నా కల నెరవేరింది.. వైరల్ వీడియో !