Asianet News TeluguAsianet News Telugu

ధోనీకి కెప్టెన్సీ టిప్స్ ఇచ్చాడు! నాకు బ్యాటింగ్ ఎలా చేయాలో చెప్పాడు... విరాట్‌కి విసుగు తెప్పించిన ఫ్యాన్...

2014 ఇంగ్లాండ్ పర్యటనలో పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బందిపడిన విరాట్ కోహ్లీ.. టీమిండియాని తెగ విసిగించిన ధోనీ వీరాభిమాని గురించి ఆర్‌సీబీ పాడ్‌కాస్ట్‌లో బయటపెట్టిన విరాట్ కోహ్లీ.. 

Virat Kohli reveals strange fan who tried to give captaincy tips to MS Dhoni cra
Author
First Published Feb 28, 2023, 10:33 AM IST | Last Updated Feb 28, 2023, 10:33 AM IST

అవకాశం రావాలే కానీ తాను సచిన్ కంటే గొప్ప బ్యాటర్‌ని అవుతా అనుకుంటాడు గల్లీ క్రికెట్‌లో సిక్సర్లు బాదే ప్రతీవాడు. అందుకే 100 అంతర్జాతీయ సెంచరీలు చేసిన ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ కూడా అనామకులు చెప్పే బ్యాటింగ్ టిప్స్‌ని, ‘అలా కాదు, ఇలా ఆడాల్సిందని’ చెప్పే సోకాల్డ్ టెక్నిక్స్‌ని ఓపిగ్గా వినాల్సి వచ్చింది. టీమిండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కూడా ఈ విషయంలో మినహాయింపు లేదు...

‘యాడ్స్ మానేసి బ్యాటింగ్‌పైన ఫోకస్ పెట్టు...’ అంటూ ఓ అభిమాని పెట్టిన ట్వీట్‌కి ‘సార్... సార్.. బ్యాటింగ్ టిప్స్ సార్...’ అంటూ రిప్లై ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ. అయితే ఇప్పుడు ధోనీ సోషల్ మీడియాకి దూరంగా ఉంటుండడంతో ఇలాంటి సమాధానాలు చూసే అదృష్టం లేకుండా పోయింది...

అయితే మహేంద్ర సింగ్ ధోనీని ఇబ్బందిపెట్టిన ఓ వింత అభిమాని గురించి తాజాగా బయటపెట్టాడు విరాట్ కోహ్లీ. టీమిండియాలోకి వచ్చిన తర్వాత 2014 ఇంగ్లాండ్ టూర్‌లో పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించాడు విరాట్ కోహ్లీ. 10 ఇన్నింగ్స్‌ల్లో 134 పరుగులు మాత్రమే చేసి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. కోహ్లీ ఫెయిల్యూర్ కారణంగా టీమిండియా 1-3 తేడాతో టెస్టు సిరీస్ కోల్పోయింది..

ఈ సమయంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి, ధోనీ కెప్టెన్సీ గురించి మీడియాలో అనేక కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ ఇద్దరికీ టీమ్‌లో ఉండే అర్హత కూడా లేదన్నట్టుగా వార్తలు ప్రసారం అయ్యాయి. 

‘‘2014లో నేను పరుగులు చేయడానికి తెగ ఇబ్బందిపడుతున్నప్పుడు జరిగిందీ సంఘటన. వన్డేల్లో కూడా స్వల్ప స్కోర్లకే అవుట్ అయ్యాను. కొచ్చి నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కాం. టీమ్ మొత్తానికి మొదటి వరుసలో సీట్లు ఇచ్చారు. అప్పుడు ఓ వ్యక్తి ఫ్లైట్ ఎక్కాడు. అతను ధోనీకి వీరాభిమాని అని అర్థమైంది..

అతను నన్ను చూడగానే నా సీటు దగ్గరికి వచ్చి.. ‘కోహ్లీ.. ఏం నడుస్తోంది. నేను నీ నుంచి నెక్ట్స్ మ్యాచ్‌లో సెంచరీ ఆశిస్తున్నా...’ అన్నాడు. ఆ  మాటకు నాకు చిర్రెత్తుకొచ్చింది. అసలే ఫామ్‌లో లేక నేను ఇబ్బందిపడుతుంటే వీడొచ్చి సెంచరీ అంటున్నాడని బాగా కోపం వచ్చింది. అయితే దాన్ని కంట్రోల్ చేసుకుని ఎక్కడ పని చేస్తున్నావ్? ఏం పని చేస్తున్నావ్? అని అడిగాడు...

అతనే ఏదో చెప్పాడు. నేను వెంటనే వచ్చే మూడు నెలల్లో నువ్వు ఆ కంపెనీకి ఛైర్మెన్ అవుతావని అన్నాను. అతను ఆశ్చర్యపోయాడు. అదెలా సాధ్యం అని అడిగాడు. అప్పుడు నేను నా పరిస్థితి చెప్పాను. ఇది వీడియో గేమ్ కాదని అన్నాను.

ఆ మాటలకు అతను అక్కడి నుంచి లేచి ధోనీ దగ్గరికి వెళ్లాడు. తన ఫెవరెట్ క్రికెటర్‌ని చూశానని సంతోషంలో తెగ గోల చేశాడు. ధోనీ పక్కన కూర్చొని టీమ్ కాంబినేషన్ గురించి చెప్పడం మొదలెట్టాడు. కెప్టెన్సీ గురించి మాహీకి టిప్స్ ఇచ్చాడు. ధోనీకి సహనం చాలా ఎక్కువ...

అందుకే అతను చెప్పినవన్నీ సైలెంట్‌గా వింటూ వచ్చాడు. అయితే మిగిలిన వాళ్లకి ఓపిక తగ్గిపోయింది. వెంటనే ‘కోచ్... కోచ్...’ అంటూ అరిచారు. అతను కూడా నవ్వేసి, వెళ్లి అతని సీట్‌లో కూర్చున్నాడు. నా క్రికెట్ కెరీర్‌లో ఇదో ఫన్నీ మూమెంట్...’ అంటూ చెప్పుకొచ్చాడు క్రికెటర్ విరాట్ కోహ్లీ.. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios