Asianet News TeluguAsianet News Telugu

విరాట్ కోహ్లి: బ్యాటింగ్‌లోనే కాదు, బౌలింగ్‌లో కూడ రికార్డు

భారత క్రికెట్ జట్టు విజయాల్లో  ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లిది  కీలక పాత్ర, కోహ్లి పుట్టిన రోజు ఇవాళ.బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడ  కోహ్లికి ఒక రికార్డు ఉంది.
 

Virat Kohli is the only bowler who has taken a wicket off the zeroth ball of his career lns
Author
First Published Nov 5, 2023, 1:10 PM IST


న్యూఢిల్లీ:  ప్రముఖ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఒక్క బాల్ కూడ వేయకుండానే  ఒక్క వికెట్  తీసుకున్న రికార్డు సాధించారు. ఈ విషయాన్ని  విరాట్ కోహ్లి సతీమణి అనుష్కశర్మ  ఇన్ స్టా వేదికగా  ప్రకటించారు.

విరాట్ కోహ్లి పుట్టిన రోజు ఇవాళ.ఆయన వయస్సు 35 ఏళ్లు.  2011లో  ఇంగ్లాండ్ తో  జరిగిన వన్ డే మ్యాచ్ లో  విరాట్ కోహ్లి  బౌలింగ్ చేశాడు.  కోహ్లి  వైడ్ బాల్ వేశాడు. ఆ సమయంలో  ఇంగ్లాండ్ జట్టు తరపున కెవిన్ పీటర్సన్  బ్యాటింగ్ చేస్తున్నాడు.  కోహ్లి వేసిన బంతిని  పీటర్సన్  పీటర్సన్  ఆడే క్రమంలో  స్టంప్ అవుటయ్యాడు.  ఆ సమయంలో  వికెట్ కీపర్ గా ఉన్న ఎం.ఎస్ ధోని  పీటర్సన్ ను స్టంప్ ఔట్ చేశారు.  

విరాట్ కోహ్లి వేసిన బాల్  వైడ్ గా కావడంతో  ఆ బాల్ ను పరిగణనలోకి తీసుకోరు.  అయితే  ఈ బాల్ కు బ్యాట్స్ మెన్ అవుటైనందున  కోహ్లికి ఒక్క వికెట్ దక్కింది. ఈ విషయాన్ని  అనుష్క శర్మ  ఇన్‌స్టాలో  వివరించింది. కోహ్లి బౌలింగ్  గణాంకాలు   0.0-0-1-1 గా ఉన్నాయని  అనుష్కశర్మ వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios