Asianet News TeluguAsianet News Telugu

జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు, ఆరోజు రాత్రంతా ఏడ్చేశా.. కోహ్లీ

ఈ కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత జీవితంలో చాలా మార్పులు చోటుచేసుకోనున్నాయని కోహ్లీ పేర్కొన్నారు. అంతేకాకుండా.. కెరీర్ తొలి రోజుల్లో తాను ఎక్కువగా బాధపడిన ఓ సందర్భాన్ని కోహ్లీ ఈ సందర్భంగా వివరించారు.

Virat Kohli 'howled' all night after team rejection
Author
Hyderabad, First Published Apr 22, 2020, 10:52 AM IST

జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదని.. ఊహించని పరిణామాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నారు. అన్​అకాడమీ మంగళవారం నిర్వహించిన ఆన్​లైన్ క్లాస్​లో కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు మాట్లాడారు. ఈ సందర్భంగా  తమ జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను, విజయం సాధించిన క్రమాన్ని విద్యార్థులతో వారు పంచుకున్నారు.

“కరోనా సంక్షోభం వల్ల జరిగిన ఓ సానుకూలాంశం ఏంటంటే.. సమాజం మరింత దయామయంగా మారింది. మహమ్మారిపై పోరాటంలో యోధుల్లా పోరాడుతున్న వైద్య, పోలీసు సిబ్బంది పట్ల మనం మరింత కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నాం. ఈ స్ఫూర్తి ఇలానేఉంటే ఈ సంక్షోభం నుంచి బయటపడగలం” అని కోహ్లీ చెప్పాడు.

ఈ కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత జీవితంలో చాలా మార్పులు చోటుచేసుకోనున్నాయని కోహ్లీ పేర్కొన్నారు. అంతేకాకుండా.. కెరీర్ తొలి రోజుల్లో తాను ఎక్కువగా బాధపడిన ఓ సందర్భాన్ని కోహ్లీ ఈ సందర్భంగా వివరించారు.

కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో రాష్ట్ర జట్టుకు ఎంపికవని సమయంలో తాను ఎంతో బాధపడ్డానని కోహ్లీ చెప్పాడు. ఆరోజు తాను రాత్రంతా కూర్చొని ఏడ్చినట్లు కోహ్లీ చెప్పాడు. రాత్రంతా ఏడ్వడంతో పాటు ‘నేనెందుకు ఎంపిక కాలేదు’ తన కోచ్​ను అడిగేవాడనని వెల్లడించాడు.

ప్రస్తుత పరిస్థితుల వల్ల అందరం దూరంగా ఉన్నా… సమాజంగా కలిసే ఉన్నామని అనుష్క శర్మ చెప్పింది. ఎదుటివారి కంటే ఎవరూ ప్రత్యేక కాదని ప్రస్తుత పరిస్థితి ఎందరికీ నేర్పుతున్నదని అభిప్రాయపడింది.

Follow Us:
Download App:
  • android
  • ios