కటక్: వెస్టిండీస్ తో రేపు ఆదివారం నిర్ణయాత్మకమైన వన్డే మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టు సభ్యులతో కలిసి ఎంజాయ్ చేశాడు. 

మూడు వన్డే సిరీస్ లో రెండు జట్లు చెరో మ్యాచు గెలుచుకుని స్కోరును సమం చేసుకున్నాయి. మూడో వన్డే ఫలితం సిరీస్ ఎవరి వశమవుతుందనే విషయాన్ని తేల్చనుంది. 

టీమిండియా జట్టు సభ్యులు గురువారం రాష్ట్ర రాజధానికి చేరుకున్నిారు. వారికి సంప్రదాయ పద్ధతిలో స్వాగతం లభించింది. మూడో వన్డేకు, రెండో వన్డేకు మధ్య జట్లకు మూడు రోజుల వ్యవధి దొరికింది. 

ఈ ఏడాదిని వెస్టిండీస్ పై సిరీస్ విజయంతో ముగించాలని విరాట్ కోహ్లీ భావిస్తున్నాడు. ఇంతకు ముందు జరిగిన ట్వంటీ20 సిరీస్ ను వెస్టిండీస్ పై 2-1 స్కోరుతో టీమిండియా గెలుచుకుంది.