Virat Kohli: టీమిండియా వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆటలో రికార్డులలోనే కాదు ఆదాయంలో కూడా ఏ క్రికెటర్ దరిదాపుల్లోకు కూడా రాని స్థాయికి చేరాడు.
పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఆట గురించి, క్రికెట్ లో అతడు సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. అయితే రికార్డులలోనే కాదు ఆదాయార్జనలో కూడా కోహ్లీ తోపే. మిగలిన ఆటలను, ఆ ఆటల్లోని ప్రముఖ వ్యక్తులను పక్కనబెడితే క్రికెట్ లో మాత్రం అతడి దరిదాపుల్లో కూడా ఏ స్టార్ క్రికెటర్ కూడా లేడు. స్టాక్ గ్రో నివేదిక ప్రకారం కోహ్లీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? ఏకంగా రూ. 1,050 కోట్లు.
స్టాక్ గ్రో రిపోర్టు ప్రకారం.. కోహ్లీ నెట్ వర్త్ విలువ రూ. 1,050 కోట్లు. ఏ ఏ రూపాల్లో కోహ్లీ ఆదాయార్జన చేస్తున్నాడో ఇక్కడ తెలుసుకుందాం..
బోర్డు, ఐపీఎల్ నుంచి..
కోహ్లీకి బీసీసీఐ గ్రేడ్ ఏ+ కాంట్రాక్ట్ ఉంది. దీని విలువ ఏడాదికి రూ. 7 కోట్లు. ఇక మూడు ఫార్మాట్లలో ఒక్కో మ్యాచ్ ఆడినందుకు గాను కోహ్లీకి భారీగానే నగదు చేతికి దక్కుతుంది. ఒక టెస్టు ఆడితే రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, టీ20కి రూ. 3 లక్షలు కోహ్లీకి బీసీసీఐ చెల్లిస్తుంది. ఐపీఎల్ లో కోహ్లీ వార్షిక వేతనం (ఆర్సీబీ) రూ. 15 కోట్లు.
బ్రాండ్ బాబు..
కోహ్లీ భారత్‌లో యూత్ ఐకాన్ గా ఉన్నాడు. చాలా మల్టీ నేషనల్ బ్రాండ్స్ అతడితో ఎండార్స్ చేసుకున్నాయి. బ్రాండ్స్ బాబుగా ఉన్న కోహ్లీ వివిధ వ్యాపార ప్రకటనల ద్వారా రోజుకు రూ. 7.5 కోట్లు - రూ. 10 కోట్ల వరకూ సంపాదిస్తున్నాడు. విరాట్ సుమారు 18 బ్రాండ్స్ కు ప్రచారకర్తగా ఉన్నాడు. ఇందులో వివో, మింత్ర, వ్రాగ్న్, వొలిని, ఊబర్, హెచ్‌ఎస్‌బీసీ, ఎంఆర్ఎఫ్, అమెరికన్ టూరిస్టర్, నాయిస్, బ్లూ స్టార్ వంటి పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు.
ప్రాపర్టీలు..
కోహ్లీకి ముంబైలో రూ. 34 కోట్లు విలువ చేసే బిల్డింగ్ ఉంది. అలాగే ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్‌లో రూ. 80 కోట్ల విలువ చేసే భవనం ఉంది. ఆండీ, రేంజ్ రోవర్, ఫార్చునర్ వంటి టాప్ మోస్ట్ బ్రాండ్ కార్స్ ధర రూ. 31 కోట్లు.
సోషల్ మీడియాలో తోపు..
ఇన్‌స్టాగ్రామ్ లో కోహ్లీకి 250 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాలో కోహ్లీ చేసే పెయిడ్ పోస్టులకు ఒక్కో దాని విలువ రూ. 8.9 కోట్లుగా ఉంది. ఇదే ట్విటర్ లో రూ. 2.5 కోట్లు.
