అలిబాగ్‌లో ఫామ్ హౌజ్ నిర్మాణ పనులను సమీక్షించిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ... ఫామ్ హౌజ్‌లో క్రికెట్ పిచ్ నిర్మించబోతున్నారంటూ వార్తలు... కొట్టిపారేసిన విరాట్ కోహ్లీ..
ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత పాపులర్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న విరాట్ కోహ్లీ, తనపై వచ్చే తప్పుడు వార్తలకు కూడా తన స్టైల్‌లో స్పందిస్తూ ఉంటాడు. కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టా ద్వారా విరాట్ కోహ్లీ, ఒక్కో పోస్టుకి రూ.11.45 కోట్ల ఆదాయం వస్తోందని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది...
ఈ వార్త వైరల్ అవుతున్న సమయంలోనే ట్విట్టర్ ద్వారా దాన్ని కొట్టిపారేశాడు విరాట్ కోహ్లీ. ‘నా జీవితంలో నేను సంపాదించిన దానికి సంతోషంగా ఉన్నా. నా సోషల్ మీడియా సంపాదన గురించి వైరల్ అవుతున్న వార్త నిజం కాదు...’ అంటూ ట్వీట్ చేశాడు విరాట్ కోహ్లీ..
తాజాగా విరాట్‌కి సంబంధించిన మరో వార్త, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీకి ముంబైలో, గురుగ్రామ్‌లో ఇళ్లు ఉన్నాయి. కొన్ని నెలల క్రితం అలిబాగ్‌లోని జిరడ్ అనే గ్రామంలో విరాట్ కోహ్లీ, ఆయన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కలిసి 8 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాడు.
ఇక్కడ 2 ఎకరాల్లో విశాలమైన, విలాసవంతమైన ఫామ్‌హౌజ్‌ని నిర్మించబోతున్నారు. దీని కోసం దాదాపు రూ.20 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు విరాట్, అనుష్క. వెస్టిండీస్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత అలిబాగ్‌లో ఫామ్ హౌజ్ నిర్మాణ పనులను సమీక్షించారు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ..

ఈ ఫామ్ హౌజ్‌లో విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేయడానికి వీలుగా ఓ క్రికెట్ పిచ్ కూడా నిర్మించబోతున్నట్టు ప్రముఖ ఇంగ్లీష్ వెబ్‌సైట్ టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించింది. దీనిపై విరాట్ కోహ్లీ తన స్టైల్‌లో రియాక్ట్ అయ్యాడు. ‘చిన్నప్పటి నుంచి చదువుతున్న పత్రికలు కూడా ఫేక్ న్యూస్ ప్రచురించడం మొదలెట్టాయి..’ అంటూ తన పట్టుకుంటున్న ఎమోజీలను ఇన్‌స్టా స్టేటస్‌గా పెట్టుకున్నాడు విరాట్ కోహ్లీ..
టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ, రాంఛీలో కట్టుకున్న ఫామ్‌హౌజ్ మాదిరిగానే అలిబాగ్‌లో విరాట్ కోహ్లీ ఫామ్‌హౌజ్‌లో పచ్చదనానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ముంబైలో ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు... తమ ఇంట్లో నుంచి అందమైన సముద్రాన్ని వీక్షిస్తున్నారు..
గురుగ్రామ్‌లోనూ వీరికి ఓ బంగ్లా కూడా ఉంది. విరాట్ కోహ్లీ తల్లి సరోజ్ కోహ్లీ, ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నారు. ఢిల్లీకి మ్యాచుల కోసం వెళ్లినప్పుడు విరాట్ కోహ్లీ, టీమ్ హోటల్‌లో కాకుండా తన ఇంట్లోని ఉంటాడు.
34 ఏళ్ల విరాట్ కోహ్లీ, ప్రస్తుతం కుటుంబంతో కలిసి సమయాన్ని గడుపుతున్నాడు. ఈ నెల 24న ఆసియా కప్ 2023 టోర్నీ కోసం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఏర్పాటు చేసే క్యాంపులో పాల్గొనే విరాట్ కోహ్లీ, ఆ తర్వాత టీమ్‌తో పాటు లంకకు వెళ్తాడు..
