ఢిల్లీ క్రికెట్ అకాడమీలో అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహారిస్తున్న సురేశ్ బత్రా...గుండెపోటుతో తుదిశ్వాస... టీనేజ్‌లో విరాట్ బ్యాటింగ్‌ను రాటుతేల్చిన సురేశ్ బత్రా...
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ సురేష్ బత్రా, గుండెపోటుతో మరణించారు. 53 ఏళ్ల సురేష్, ఢిల్లీ క్రికెట్ అకాడమీలో అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహారిస్తున్నారు. టీనేజ్ వయసులో విరాట్‌కి బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహారించిన సురేష్ బత్రా, కోహ్లీ బ్యాటింగ్ స్టైల్ ఇంప్రూవ్ అవ్వడానికి ఎంతగానో సాయం చేశారు.
ఢిల్లీ క్రికెట్ అకాడమీలో హెడ్ కోచ్‌గా వ్యవహారిస్తున్న రాజ్‌కుమార్ శర్మ ‘నేను ఈ రోజు నా తమ్ముడికి కోల్పోయాను. సురేష్ బత్రాతో నాకు 1985 నుంచి ప్రత్యేకమైన అనుబంధం ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. రాజ్‌కుమార్ శర్మ కూడా కోహ్లీకి కోచ్‌గా వ్యవహారించారు.
విరాట్ కోహ్లీతో పాటు ఢిల్లీ జట్టు నుంచి భారత జట్టులోకి వచ్చిన ఎందరో క్రికెటర్లకు కోచ్‌గా వ్యవహారించాడు సురేష్ బత్రా. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ప్రిపేర్ అవుతున్న కోహ్లీకి, సురేష్ బత్రా మరణం షాకింగ్ విషయమే.
