భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ... ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్ కోసం యూఏఈలో ఉన్నాడు. తన సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేఆఫ్ చేరడంతో ఈసారి ఎలాగైనా కప్ గెలవాలనే పట్టుదలతో ఉన్న విరాట్ అండ్ టీమ్... యూఏఈలోనే కెప్టెన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడే ప్రతీ క్రికెట్ మ్యాచ్‌కి హాజరవుతూ భర్త విరాట్ కోహ్లీని ఉత్సాహపరుస్తోంది అనుష్క శర్మ.

2017 డిసెంబర్‌లో అనుష్క శర్మను పెళ్లి చేసుకున్న విరాట్ కోహ్లీ, వచ్చే ఏడాది జనవరిలో తండ్రి కాబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకే గర్భవతి అయిన అనుష్క శర్మను ఒంటరిగా వదలకుండా అన్నీ తానై చూసుకుంటున్నాడు విరాట్.

 

 

తాజాగా తన బర్త్ డే వేడుకలను కూడా శ్రీమతితో కలిసి చేసుకున్నాడు కోహ్లీ. ఈ వేడుకలకు బయో బబుల్ నిబంధనల కారణంగా రాయల్ ఛాలెంజర్స్ టీమ్ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఎప్పటిలాగే విరాట్‌కు కేక్ బాత్ చేయించారు టీమ్ సభ్యులు. విరాట్ కోహ్లీ బర్త్ డే వేడుకల వీడియోను ఇక్కడ చూడండి.