న్యూఢిల్లీ: న్యూజిలాండ్ పై జరిగిన టెస్టు సిరీస్ లో విఫలమైన బ్యాట్స్ మన్ కమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతుగా నిలిచాడు. రిషబ్ పంత్ కు చాలా అవకాశాలు ఇచ్చామని, అయితే అతని స్థానంలో మరొకరి కోసం తాము చూడడం లేదని ఆయన అన్నారు. 

న్యూజిలాండ్ పై ఉమ్మడిగా విఫలమయ్యామని, అతని ఒక్కడిని టార్గెట్ చేయడం సరి కాదని ఆయన అన్నారు. రిషబ్ పంత్ గత ఏడాది కాలంగా అవకాశాలు పొందుతూ వస్తున్నాడు. న్యూజిలాండ్ పై జరిగిన రెండు టెస్టు మ్యాచుల్లోని నాలుగు ఇన్నింగ్సుల్లో కలిసి 60 పరుగులు చేశాడు. 

Also Read: కివీస్ పై ఘోర ఓటమి: కోహ్లీ బ్యాటింగ్ ఫట్, అయ్యో అనాల్సిందే

సరైన సమయంలో అతన్ని విడిగా చూడాల్సి ఉంటుందని, బ్యాటింగ్ గ్రూప్ గా లేదా జట్టుగా తామంతా గ్రూప్ గానే వ్యవహరిస్తామని విరాట్ కోహ్లీ అన్నారు. రిషబ్ పంత్ తన స్థానం ఎటూ పోదనే విశ్వాసంతో వ్యవహరిస్తున్నాడా అని అడిగితే ఎవరు కూడా ఆ విధంగా ఆలోచించడానికి జట్టు సంస్కృతి సహకరించదని ఆయన అన్నారు. 

ఈ జట్టులో తమ స్థానం ఎటూ పోదు అనే పద్ధతిలో ఎవరూ వ్యవహరించడం లేదని, ఆ సంస్కృతిని తాము పెంచామని, బాధ్యతలు తీసుకుని కఠిన శ్రమ చేయాలని చెప్పామని, అది జరుగుతుందా లేదా అనేది వేరే విషయమని, అప్పుడు ఆటగాళ్లతో మాట్లాడాల్సి ఉంటుందని ఆయన అన్నారు. 

Also Read: న్యూజిలాండ్ టూర్: సిరీస్ లకు దూరమైనా టాప్ స్కోరర్స్ వీళ్లే...