టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క చనిపోయింది. వీరి ఇంటి పెంపుడు కుక్క బ్రునో బుధవారం ఉదయం మృతి చెందింది. ఈ విషయాన్ని కోహ్లి తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. 

‘11 ఏళ్ల మన ప్రయాణం జీవితాంతం ఓ తీపి​ గుర్తుగా మిగిలిపోతుంది. ఎప్పుడు నీ ప్రేమను మాపై కురిపించావు. ఈరోజు ఇక్కడి నుంచి వేరు చోటుకు వెళ్లావు. నీ ఆత్మకు శాంతి చేకూరేలాని దేవుడుని కోరుకుంటున్నా. రెస్ట్‌ ఇన్‌ పీస్‌ బ్రూనో’అంటూ కోహ్లి ఉద్వేగభరిత ట్వీట్‌ చేశాడు. కోహ్లి సతీమణి అనుష్క శర్మ కూడా ‘మిస్‌ యూ బ్రూనో.. రిప్‌’ అంటూ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

♥️ Bruno ♥️ RIP ♥️

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on May 5, 2020 at 8:39pm PDT

ఇక విరాట్‌ కోహ్లికి బ్రూనో అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒత్తిడి తగ్గించుకోవడానికి బ్రునోతో ఆడుకునేవాడినని అతడు ఎన్నో సార్లు చెప్పాడు. అంతేకాకుండా కోహ్లి సోషల్‌ మీడియాలో బ్రూనోతో దిగిన ఫోటోలను షేర్‌ చేస్తుండేవాడు. ఇక అనుష్కకు కూడా బ్రూనోతో మంచి బాండింగే ఉంది. అమె కూడా బ్రూనోతో దిగిన ఫోటోలను తరుచు తన ఇన్‌స్టాలో షేర్‌ చేస్తుండేవారు.