భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లీ తండ్రి అయ్యాడు. ఆయన భార్య, అనుష్క శర్మ ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు విరాట్ కోహ్లీ. 

తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారని, తమ జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైందని సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ. 

సిడ్నీలో భారత జట్టు అద్భుత పోరాట ప్రతిభతో మూడో టెస్టును డ్రా చేసుకున్న రోజునే భారత సారథి తండ్రి కావడం విశేషం. ఈరోజు భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ పుట్టినరోజు కూడా..

తల్లి కాబోతున్న అనుష్క శర్మకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతోనే భారత సారథి విరాట్ కోహ్లీ... మొదటి టెస్టు ముగిసిన తర్వాత పెటర్నిటీ లీవ్ ద్వారా స్వదేశానికి వచ్చిన సంగతి తెలిసిందే. క్వారంటైన్ నిబంధనల కారణంగా నాలుగో టెస్టుకు కూడా దూరంగా ఉన్నాడు విరాట్.