అతని ఏకాగ్రతని దెబ్బతీసేందుకు అండర్సన్ తొలుత నోరు జారగా.. విరాట్ కోహ్లీ కూడా అదేరీతిలో బదులిచ్చాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తున్నా.. ఫీల్డ్ అంపైర్ మౌనంగా చూస్తుండిపోయాడు.
లార్డ్స్ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా లండన్ వేదికగా.. ఇంగ్లాండ్ తో తలపడుతున్న సంగతి తెలిసిందే. రెండో టెస్టు జరుగుతుండగా.. ఈ మ్యాచ్ నేపథ్యంలో కోహ్లీ, జేమ్స్ అండర్సన్ ల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది.
. మ్యాచ్‌లో నాలుగో రోజైన ఆదివారం క్రీజులో ఉన్నంతసేపు విరాట్ కోహ్లీ (20: 31 బంతుల్లో 4x4) దూకుడుగా ఆడేస్తూ కనిపించాడు. దాంతో.. అతని ఏకాగ్రతని దెబ్బతీసేందుకు అండర్సన్ తొలుత నోరు జారగా.. విరాట్ కోహ్లీ కూడా అదేరీతిలో బదులిచ్చాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తున్నా.. ఫీల్డ్ అంపైర్ మౌనంగా చూస్తుండిపోయాడు.
కాగా.. ఈ మాటల యుద్ధం తర్వాత.. కోహ్లీలో మార్పు వచ్చింది. ఆ మార్పు కారణంగానే.. కోహ్లీ ఫుల్ ఛార్జ్ అయ్యారు. ఫలితంగా లార్డ్స్ లో విజయం సాధించింది. నెటిజన్లు కూడా అదే అభిప్రాయపడుతున్నారు. ఆ వార్ వర్డ్స్ తర్వాత.. కోహ్లీ ఇలా విజయం తో ప్రతీకారం తీర్చుకున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా.. ఈ మ్యాచ్ మొదటి సెషన్ లో కోహ్లీ దాదాపు డ్రెస్సింగ్ రూమ్ బాల్కనీలోనూ కూర్చొని కనిపించారు. భారత క్రికెటర్లు చేస్తున్న పరుగులను ఆనందిస్తూ కనిపించారు. భారత క్రికెటర్లు అదరగొడుతుంటే.. ఇంగ్లాండ్ ఆటగాళ్లు ప్రస్టేట్ అయ్యారు. కోహ్లీ మాత్రం మ్యాచ్ ని చూస్తూ ఎంజాయ్ చేశారు. నాగినీ డ్యాన్స్ కూడా వేయడం విశేషం. కాగా.. ఈ మ్యాచ్ లో ఎక్కువగా అదరగొట్టింది. కేఎల్ రాహుల్, బుమ్రా, షమీలే కావడం విశేషం.
