Asianet News TeluguAsianet News Telugu

వుమెన్స్ ఐపీఎల్ మీడియా రైట్స్‌కి భారీ క్రేజ్... రూ.951 కోట్లకు దక్కించుకున్న వయాకామ్18...

WOmen's IPL 2023: రూ.951 కోట్ల భారీ మొత్తానికి వుమెన్స్ ఐపీఎల్ 2023-27 మీడియా హక్కులను సొంతం చేసుకున్న వయాకామ్18... ఒక్కో మ్యాచ్‌కి రూ.7.09 కోట్ల ఆదాయం బీసీసీఐ ఖాతాలో

Viacom18 wins women's IPL media rights for 951 cr for the 2023-27 Seasons
Author
First Published Jan 16, 2023, 12:31 PM IST

బీసీసీఐ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశపెడుతున్న టోర్నీ వుమెన్స్ ఐపీఎల్.పురుషుల ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైన 16 సీజన్లకు మహిళల కోసం మొక్కుబడిగా టీ20 ఛాలెంజ్‌ని నిర్వహిస్తూ వచ్చిన బీసీసీఐ, ఎట్టకేలకు వుమెన్స్ ఐపీఎల్‌ నిర్వహించాలని డిసైడ్ అయ్యింది..

వుమెన్స్ ఐపీఎల్ టీమ్స్‌ని కొనుగోలు చేసేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఫ్రాంఛైజీలు చాలా వరకూ ఆసక్తి చూపించాయి. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ వంటి ఫ్రాంఛైజీలన్నీ మహిళల ఐపీఎల్ టీమ్‌లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేయడంతో వుమెన్స్ ఐపీఎల్‌కి మంచి క్రేజ్ వచ్చేసింది...

వుమెన్స్ ఐపీఎల్‌ మీడియా హక్కుల విక్రయం కోసం బిడ్డింగ్ నిర్వహించింది బీసీసీఐ. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో పాటు సోనీ నెట్‌వర్క్, అమెజాన్ ప్రైమ్ వంటి బడా కంపెనీలన్నీ వుమెన్స్ ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం పోటీపడ్డాయి. రూ.951 కోట్ల భారీ మొత్తం చెల్లించేందుకు సిద్ధమైన వయాకామ్18, 2023-27 సీజన్లకు సంబంధించిన ప్రసార హక్కులను సొంతం చేసుకుంది...

టీవీ ప్రసార హక్కులతో పాటు డిజిటల్ ప్రసార హక్కులను కూడా సొంతం చేసుకుంది వయాకామ్18.  2023 సీజన్‌లో ఐదు ఫ్రాంఛైజీలు బరిలో దిగబోతున్నాయి. దీంతో ఒక్కో మ్యాచ్‌కి రూ.7.09 కోట్ల ఆదాయం బీసీసీఐ ఖాతాలో చేరనుంది. పురుషుల ఐపీఎల్ 2023-27 సీజన్ మీడియా హక్కుల విక్రయం ద్వారా రూ.48,390 కోట్లు బీసీసీఐ ఖాతాలో చేరాయి. ఇప్పుడు మహిళా ఐపీఎల్ 2023-27 సీజన్ హక్కుల ద్వారా మరో రూ.951 కోట్లు భారత క్రికెట్ బోర్డు ఖాతాలో చేరాయి. మొత్తంగా ఐపీఎల్ (పురుషుల + మహిళల) మీడియా హక్కుల ద్వారా బీసీసీఐ ఖాతాలోకి రూ.50 వేల కోట్లు (రూ. 49,341 కోట్లు) వచ్చి చేరాయి...

‘వయాకామ్18, వుమెన్స్ ఐపీఎల్ మీడియా హక్కులను దక్కించుకుంది. బీసీసీఐపై, బీసీసీఐ వుమెన్స్ టీమ్స్‌పై నమ్మకం పెట్టినందుకు మీకు థ్యాంక్యూ.. వయాకామ్ రూ.951 కోట్లు అంటే మ్యాచ్‌కి రూ.7.09 కోట్లు చెల్లించేందుకు ఒప్పుకుంది. మహిళా క్రికెట్‌ అభివృద్ధికి ఇది చాలా ఉపయోగపడుతుంది...’ అంటూ ట్వీట్ చేశాడు బీసీసీఐ సెక్రటరీ జై షా.. 

 

వాస్తవానికి జనవరి 12న వుమెన్స్ ఐపీఎల్ ప్రసార హక్కుల వేలం జరగాల్సి ఉంది... అయితే అనివార్య కారణాలతో వుమెన్స్ ఐపీఎల్‌ మీడియా హక్కులకు సంబంధించిన వేలాన్ని జనవరి 16న నిర్వహించారు. అయితే  ఇందులో ఓ ట్వీస్ట్ ఉంది...

 

ఒకవేళ సీజన్ 2023 కోసం ఐదు జట్లు సిద్ధం కాకపోతే, ఈ ఏడాది టోర్నీని నిర్వహించడం వీలు కాదు. వచ్చే ఏడాదికి వాయిదా వేస్తారు... అంటే కనీసం 75-80 మంది ప్లేయర్లు, వుమెన్స్ ఐపీఎల్‌లో పాల్గొంటేనే ఈ సీజన్‌లో లీగ్ జరుగుతుంది. ప్లేయర్లు తగ్గితే ఐదు జట్లను ఏర్పాటు చేయడం జరగని పని. కాబట్టి ఈ సీజన్‌లో టోర్నీ నిర్వహించబోమని బీసీసీఐ తెలియచేసింది. ఇదే జరిగితే మీడియా రైట్స్‌ వేలం కూడా మరోసారి నిర్వహించబడుతుంది...

వుమెన్స్ టీ20 లీగ్‌ని వేలం ద్వారా నిర్వహించబోతున్నారు. రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల బేస్ ప్రైజ్ వరకూ ప్లేయర్లు వేలంలోకి వస్తారు. అన్‌క్యాప్డ్ ప్లేయర్ల బేస్ ప్రైజ్ రూ.10-20 లక్షలుగా ఉంటే క్యాప్డ్ ప్లేయర్ల బేస్ ప్రైజ్ రూ.30-50 లక్షలుగా నిర్ణయించారు...

తొలి సీజన్ కావడంతో డ్రాఫ్ట్ పద్ధతిని అమలు చేసేందుకు బీసీసీఐ మొగ్గుచూపించడం లేదు. దీంతో హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన వంటి స్టార్ ప్లేయర్లు కూడా వేలంలో పాల్గొనబోతున్నారు. వుమెన్స్ టీ20 లీగ్‌లో పాల్గొనాలని అనుకునే ప్లేయర్లు అందరూ ఆయా రాష్ట్రాల క్రికెట్ బోర్డుల ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది...

జనవరి 26 వరకూ రిజిస్ట్రేషన్‌కి గడువు ఉంది. రిజిస్ట్రేషన్ తర్వాత పురుషుల ఐపీఎల్ మాదిరిగానే సెట్స్ మాదిరిగా ప్లేయర్ల వేలం జరుగుతుంది. ఫిబ్రవరి 11న వేలం నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి...

Follow Us:
Download App:
  • android
  • ios