IND vs SA: 'వారు దేనినీ గెలవరు...' టీమిండియాపై మరోసారి నోరుపారేసుకున్న మైఖేల్ వాన్
IND vs SA: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ టీమిండియాపై మరోసారి హేళన చేశారు. టీమిండియాజట్టులో ప్రతిభ, వనరులకు కొదువ లేకున్నా గత పదేళ్లలో ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేకపోయిందని మైకెల్ వాన్ విమర్శించాడు. క్రీడా ప్రపంచంలో అండర్ అచీవర్ జట్లలో భారత జట్టు ఒకటి అని వాన్ పేర్కొన్నాడు.
IND vs SA: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ టీమిండియాపై మరోసారి హేళన చేశారు. టీమిండియాజట్టులో ప్రతిభ, వనరులకు కొదువ లేకున్నా గత పదేళ్లలో ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేకపోయిందని మైకెల్ వాన్ విమర్శించాడు. క్రీడా ప్రపంచంలో అండర్ అచీవర్ జట్లలో భారత జట్టు ఒకటి అని వాన్ పేర్కొన్నాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన సెంచూరియన్ టెస్టులో టీమిండియా 32 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ ఓటమి కారణంగా ఆఫ్రికా గడ్డపై మరోసారి టెస్టు సిరీస్ కైవసం చేసుకోవాలన్న భారత జట్టు కల చెదిరిపోయింది. ఇప్పుడు కేప్ టౌన్ టెస్టు మ్యాచ్ ను డ్రా చేసుకోవడం ద్వారా సిరీస్ ను సమం చేసేందుకు భారత జట్టు ప్రయత్నిస్తుంది. జనవరి 3 నుంచి కేప్ టౌన్ టెస్టు మ్యాచ్ జరగనుంది.
టీమ్ ఇండియాను టార్గెట్ చేసిన మైకేల్ వాన్
ఘోర పరాజయం తర్వాత భారత జట్టు లోపాలపై క్రికెట్ నిపుణులు లెక్కలు వేస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ పేరు కూడా చేరింది. ఈ తరుణంలో టీమ్ ఇండియాను వాన్ హేళన చేసాడు. భారత జట్టు దేనినీ గెలవదు. క్రీడా ప్రపంచంలో అండర్ అచీవర్ జట్లలో భారత్ ఒకటి అని వాన్ అభివర్ణించాడు.
తొలి టెస్టులో దక్షిణాఫ్రికాతో ఓటమి తరువాత ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ మరోసారి టీమిండియాపై నోరు పారేసుకున్నాడు.'గత పదేళ్లలో టీమిండియా అంత చెప్పుకోదగిన విజయాలను సాధించలేదు. ఇటీవలి కాలంలో కూడా చాలా తక్కువ విజయాలు సాధించిన జట్టుగా నేను భావిస్తున్నాను. వారు దేనినీ గెలవరు. వారి వల్ల ఏదీ కాదు. 2013లో ఐసీసీ ప్రపంచకప్ గెలిచింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయింది. ప్రతిభ, వనరులకు కొదువ లేకున్నా గత పదేళ్లలో వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్, డబ్ల్యూటీసీ టోర్నీల్లో టీమిండియా విజేతగా నిలవలేకపోయింది. వారు దేనినీ గెలవలేరు' అని భారత జట్టును వాన్ ఎగతాళి చేశారు.
గత ఏడాది T20 ప్రపంచకప్‌లో సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత కూడా మైఖేల్ వాన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. 'మెన్ ఇన్ బ్లూ'ని ఎగతాళి చేశాడు. క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త ప్రదర్శన చేసిన వైట్ బాల్ జట్టుగా టీమిండియాను అభివర్ణించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా రెండు సార్లు టెస్ట్ సిరీస్ గెలిచినా.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం ఆస్ట్రేలియాను ఓడించలేకపోయిందని వాన్ ఆరోపించాడు.
మైకేల్ వాన్ ఇంగ్లండ్ తరఫున 82 టెస్టులు, 86 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. వాన్ తన ODI క్రికెట్‌లో 27.15 సగటుతో 1982 పరుగులు చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 90 నాటౌట్. ODIతో పోలిస్తే, మైఖేల్ వాన్ టెస్ట్ క్రికెట్‌లో చాలా మంచి రికార్డును కలిగి ఉన్నాడు. అతను 147 ఇన్నింగ్స్‌లలో 41.44 సగటుతో 5719 పరుగులు చేశాడు. వాన్ టెస్టుల్లో 18 సెంచరీలు చేశాడు.