ఎంతో సురక్షితం అని చెప్పే ఐపీఎల్ బయో బబుల్ ని దాటుకొని కరోనా వైరస్ లోపలి పాకింది. కేకేఆర్ ప్లేయర్ పాట్ కమిన్స్ కరోనా పాజిటివ్ గా తేలాడు. అతనితో పాటు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కూడా పాజిటివ్ గా తేలారు. మరికొంతమంది కేకేఆర్ స్టాఫ్ సైతం లక్షణాలతో బాధపడుతున్నారు. దీనితో ఇప్పుడు అందరిలోను గుబులు పెరిగిపోయింది. దీనితో నేడు ఆర్సీబీతో జరగాల్సిన మ్యాచును రీషెడ్యూలు చేసారు. 

ఐపీఎల్ బయో బబుల్ పూర్తి సురక్షితం అని చెప్పినప్పటికీ... వైరస్ లోపలి ఎలా ప్రవేశించిందని విషయంలో టీములు తర్జనభర్జన పడుతున్నాయి. బాబుల్ ను ఛేదించుకొని వచ్చిన వైరస్ కేవలం కోల్కతా జట్టు వరకు మాత్రమే పరిమితమయిందా, లేదా ఇతర జట్ల ప్లేయర్స్ కి కూడా ఏమైనా పాకిందా అనే దిశగా ఆరా తీస్తున్నారు.

ఈ సీజన్ ఆరంభంలో ఆస్ట్రేలియన్ అల్ రౌండర్ డేనియల్ సంస్ కూడా కరోనా పాజిటివ్ గా తేలిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆడమ్ జాంప,కేన్ రిచర్డ్ సన్, ఆండ్రూ టై భారతదేశాన్ని వీడి ఆస్ట్రేలియా చేరుకున్నారు. ఆస్ట్రేలియా ప్లేయర్ల గురించి బీసీసీఐ తో క్రికెట్ ఆస్ట్రేలియా సంప్రదింపులు జరుపుతుంది.