కరోనా మహమ్మరిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. అందులో భాగంగానే... ఆదివారం జనతా కర్ఫ్యూ చేపట్టారు. ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఎవరూ బయటకు అడుగుపెట్టకూడదంటూ సూచించారు. అత్యవసరం అయితే.. తప్ప అందరూ స్వీయ నిర్భందాన్ని పాటించాలని సూచించారు.

Also Read బ్రేకింగ్... స్కాట్లాండ్ క్రికెటర్ కి కరోనా...

కాగా... ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుని స్వాగతించిన పలువురు సెలబ్రెటీలు..వాళ్లు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్లు చేశారు. కాగా... వారిలో టీమిండియా క్రికెటర్ మహ్మద్ కైఫ్ కూడా ఉన్నారు. అయితే... కైఫ్ చేసిన ట్వీట్ కి వెంటనే మోదీ మరో రిప్లై ఇవ్వడం విశేషం.

 ‘  కరోనా వైరస్‌పై ప్రధాని మోదీ చేసిన సూచన చాలా ముఖ్యమైనది. కరోనా నిరోధానికి జనతా కర్ఫ్యూతో దేశం యుద్ధాన్ని ప్రకటించిన క్రమంలో మోదీ సూచనను అంతా పాటించాలి’ అని కైఫ్‌ కోరాడు. దీనిపై మోదీ మరో ట్వీట్‌ చేశారు. ‘ మరో భాగస్వామ్యానికి సమయం వచ్చింది.  కరోనాపై పోరాటానికి భారత్‌ మొత్తం భాగస్వామ్యం కావాలి’ అని కైఫ్‌ ట్వీట్‌కు మోదీ రిప్లై ఇచ్చారు.

దీనిలో భాగంగా 2002లో నాట్‌వెస్ట్‌ ఫైనల్‌లో భారత్‌ 326 పరుగుల టార్గెట్‌ను ఛేదించి విజయం సాధించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ‘ఆనాటి ఫైనల్‌ను ఎవరూ మర్చిపోలేరు. మహ్మద్‌ కైఫ్‌-యువరాజ్‌ సింగ్‌లు ఇద్దరూ అసాధారణమైన క్రికెటర్లు. నాట్‌వెస్ట్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారీ భాగస్వామ్యం సాధించిన విషయం ఎప్పటికీ చిరస్మరణీయమే’ అని మోదీ పేర్కొన్నారు.