వీరబాదుడు వీరేంద్ర సెహ్వాగ్... క్రికెట్ అభిమానుల్లో వీరూకి ఉండే ఫాలోయింగ్ వేరు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు సెహ్వాగ్. భారత క్రికెట్‌లో అనితర సాధ్యమైన రికార్డులు క్రియేట్ చేసిన వీరూ, ఈ ఐపీఎల్ సీజన్ చాలా ప్రత్యేకమని చెబుతున్నాడు వీరూ. 

‘రిటైర్మెంట్ తర్వాత తొలిసారిగా ధోనీ మైదానంలో దిగబోతున్నాడు. అందుకే ఈ సీజన్ చాలా స్పెషల్. మాహీ బ్యాటింగ్, కీపింగ్ అండ్ కెప్టెన్సీ చూసేందుకు ఎదురుచూస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చారు వీరూ. కరోనా కారణంగా మానసిక ఒత్తిడి, ఆందోళనల్లో కూరుకుపోయిన భారతీయులకు ఐపీఎల్ తిరిగి ఉత్సాహాన్ని నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు ఈ మాజీ ఓపెనర్.
.

Dhoni, Sehwag,IPL 2020 ధోనీ, సెహ్వాగ్


 వన్డేల్లో డబుల్ సెంచరీ, టెస్టుల్లో రెండు త్రిబుల్ సెంచరీలు చేసిన ఏకైక భారత క్రికెటర్ సెహ్వాగ్‌కు కెరీర్ చివరి దశలో జట్టులో స్థానం దక్కలేదు. కొన్నాళ్లు వేచి చూసి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇలా వీరూ అర్ధాంతరంగా రిటైర్ అవ్వడానికి ధోనీయే కారణమంటారు. అలాంటిది ధోనీ రీఎంట్రీ గురించి వీరూ స్పందించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది.