టీమిండియా మాజీ ఆటగాడు వెంకటేశ్ ప్రసాద్ బౌలింగ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు. బిసిసిఐ భారత జట్టు కోసం నూతన కోచింగ్ సిబ్బందిని నియమించడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈ  మాజీ బౌలర్ వెంకటేశ్ టీమిండియా బౌలింగ్ కోచ్ పదవిపై  కన్నేసి దరఖాస్తు కూడా చేసుకున్నాడు. 

గతంలో కూడా ఇతడికి భారత జట్టు బౌలింగ్ కోచ్ గా పనిచేసిన అనుభవం వుంది. 2007 నుండి 2009 వరకు ఇతడు కోచ్ గా వ్యవహరించాడు. ఈ సమయంలోనే టీమిండియా మొదటి ఐసిసి టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. కాబట్టి గత అనుభవం రిత్యా తనను బౌలింగ్ కోచ్ గా నియమించాలని కోరుతున్నాడు. తనకు అవకాశమిస్తే భారత  బౌలింగ్ విభాగాన్ని మరింత బలంగా తయారు చేస్తానని వెంకటేశ్ ప్రసాద్ తెలిపాడు. 

వెంకటేశ్ ప్రసాద్ టీమిండియా తరపున 161 వన్డేలు, 33  టెస్టులు ఆడాడు. అతడు తన వన్డే కెరీర్లో మొత్తం  196 వికెట్లు, టెస్టుల్లో 96 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపిఎల్ లో  కూడా అతడు చెన్నై, బెంగళూరు, పంజాబ్ జట్లుకు బౌలింగ్ కోచ్ గా పనిచేశాడు.