టీమిండియా-వెస్టిండిస్ ల మధ్య ఇవాళ్టి(శనివారం) నుండి టీ20 సీరిస్ ఆరంభంకానుంది. యూఎస్ఏలోని ప్లోరిడాలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం కోహ్లీసేన సంసిద్దమయ్యింది. విండీస్ తో జరగనున్న మొదటి టీ20 మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ లు పోటీపడనున్నారు. అయితే బయట ప్రచారం జరుగుతున్నట్ల ఆదిపత్యం  కోసం మాత్రం కాదండోయ్. వరల్డ్ రికార్డు కోసం మాత్రమే. 

అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో కోహ్లీ, రోహిత్ లకు మంచి రికార్డుంది. ఇప్పటివరకు వీరిద్దరి ఖాతాలో సమానంగా 20 హాఫ్ సెంచరీలున్నాయి.  కోహ్లీ కేవల 62  మ్యాచుల్లోనే ఈ ఘనత సాధిస్తే రోహిత్ మాత్రం 86 ఇన్నింగ్సుల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇలా అంతర్జాతీయ క్రికెట్లో  అత్యధిక అర్థశతకాలు బాదిన రికార్డు  ప్రస్తుతం వీరిద్దరి పేరిటే వుంది.

దీంతో ఇవాళ విండీస్ తో జరగనున్న టీ20 మ్యాచ్ లో ఎవరు రాణిస్తే ఈ రికార్డు వారి సొంతం కానుంది. అలా కాకుండా మళ్లీ వీరిద్దరు అర్థశతకాలు బాదితే మాత్రం మళ్లీ సంయుక్తంగానే కొనసాగుతారు. అయితే కెప్టెన్, వైస్ కెప్టెన్ ల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానులు కూడా రెండుగా చీలిపోయి తమ అభిమాన ఆటగాడే మొదట ఈ  రికార్డును సోలోగా అందుకోవాలని కోరుకుంటున్నాయి. ఈ  విషయంలో  కోహ్లీ, రోహిత్ లలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి  మరి. 

వీరిద్దరి తర్వాత 16 అర్థశతకాలతో కివీస్ ఓపెనర్ మార్టిన్  గుప్తిల్ రెండో స్థానంలో నిలిచాడు. వీండీస్ విధ్వంసకారుడు క్రిస్ గేల్ 15, కివీస్ ఆటగాడు బ్రెండన్ మెక్ కల్లమ్ లు 15 సెంచరీలతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. భారత్ నుండి కోహ్లీ, రోహిత్ ల రికార్డుకు దరిదాపుల్లో ఒక్క ఆటగాడు కూడా లేడు. మరో ఓపెన్  శిఖర్ ధవన్ 9 హాఫ్ సెంచరీలతో వీరిద్దరి తర్వాత మూడో స్థానంలో నిలిచిన భారత ఆటగాడు.