వీరేంద్ర సెహ్వాగ్... మాజీ డాషింగ్ ఓపెనర్. గతంలో ఇతడు క్రీజులో వున్నంతసేపు పరుగుల వరద పారిస్తూ ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరుగెత్తించేవాడు. ఇలా క్రికెటర్ గా మైదానంలో ఆట ఎంత సీరియస్ గా వుండేదో అతడు కూడా అలాగే వుండేవాడు. కేవలం క్రికెట్ గురించి తప్ప వేరే విషయాలను పట్టించుకునేవాడు కాదు. అయితే క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత ఏమైందో ఏమోగానీ అతడు మొత్తంగా మారిపోయాడు. ఫన్నీ కామెంట్స్, సోషల్ మీడియా పోస్టులతో అభిమానులను అలరిస్తూ సరదాకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. 

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండే సెహ్వాగ్ ఈసారి ప్రపంచవ్యాప్తంగా వున్న భర్తలను ఉద్దేశిస్తూ ఓ కామెంట్ చేశాడు. భార్యల చేతుల్లో నలిగిపోతున్న భర్తలను కాస్సేపు నవ్వించే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంగా అమెరికన్ కమెడియన్ మిల్టన్ బెర్లే మాటలను గుర్తుచేశాడు. '' మంచి భార్య అంటే తన తప్పున్నప్పటికి  భర్తను క్షమించి వదిలిపెట్టేది. గుడ్ లైఫ్ విత్ వండర్‌‌ఫుల్ వైఫ్.'' అంటూ సెహ్వాగ్ ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ కామెంట్స్ కు తన భార్య ఆర్తితో కలిసున్న ఫోటోను జతచేశాడు. 

 సెహ్వాగ్ భార్యాభర్తల మధ్యసాగే సరదా  గొడవల గురించి చేసిన కామెంట్ నెటిజన్లు అమితంగా ఆకట్టుకున్నట్లుంది. అందువల్లే ఈ పోస్ట్ షేర్ చేసిన గంట వ్యవధిలోనే 30వేల పైచిలుకు  లైకులను పొందింది. అంతేకాకుండా వివిధ రకాల కామెంట్స్ తో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇక సెహ్వాగ్ టైమింగ్, రైమింగ్ తో కూడిన ఈ సరదా కామెంట్ ను అభిమానులు మెచ్చుకోకుండా వుండలేకపోతున్నారు. 

గతంలోనూ సెహ్వాగ్ ఇలా భార్యభర్తల అనుబంధం గురించి సరదాగా కామెంట్ చేసిన విషయం  తెలిసిందే. కొన్నిసార్లు తనపై తానే సెటైర్లు వేసుకుని అభిమానులకు సరదాను పంచాడు కూడా. ఇలా ఒక్కప్పుడు సీరియస్ క్రికెటర్ వుండి అభిమానుల మనసులు దోచుకున్న సెహ్వాగ్ ఇప్పుడు సరదా మనిషిగా మారి ఆ పని చేస్తున్నాడు.
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A good wife always forgives her husband when she is wrong :) Good life with wonderful wife @aartisehwag !

A post shared by Virender Sehwag (@virendersehwag) on Aug 21, 2019 at 12:10am PDT