ప్రపంచ కప్ ముగిసిన తర్వాత టీమిండియాకు నూతన కోచింగ్ సిబ్బందిని నియమించే ప్రక్రియను బిసిసిఐ చేపట్టింది. అయితే ఆసక్తి కలిగిన వారి నుండి దరఖాస్తులు స్వీకరించి... ఇంటర్వ్యూలు నిర్వహించే బాధ్యతను సీఏసీ(క్రికెట్ అడ్వైజరీ కమిటీ)కి అప్పగించింది.  ఇలా ఓ వైపు ఎంపిక ప్రక్రియ కొనసాగుతుండగానే కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ రవిశాస్త్రినే చీఫ్ కోచ్ గా కొనసాగించాలంటూ కోరాడు. ఇలా రవిశాస్త్రికి కోహ్లీకి బహిరంగంగా మద్దతివ్వడం వివాదాస్పదంగా మారుతోంది. 

టీమిండియా కెప్టెన్ గా కోహ్లీ కూడా కోచింగ్ సిబ్బంది ఎంపికలో నిర్ణయాత్మక పాత్ర వుంటుంది. అలాంటి వ్యక్తి ఇంకా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగానే రవిశాస్త్రికే తన మద్దతంటూ మీడియా ఎదుటే ప్రకటించడాన్ని తప్పుబడుతున్నారు. అతన్నే కొనసాగించాలని భావిస్తే ఇలా ఇతరుల నుండి దరఖాస్తులను కోరడం ఎందుకంటూ ప్రముఖ వ్యాఖ్యాతలు హర్షా బోగ్లే, ఆకాశ్ చోప్రా వంటి వారు ప్రశ్నిస్తున్నారు. 

అయితే చీఫ్ కోచ్ ఎంపికపై కోహ్లీ చేసిన వ్యాఖ్యలను మాజీ టీమిండియా సారథి సౌరవ్ గంగూలీ మద్దతిచ్చాడు. '' విదేశీ పర్యటనకు వెళుతూ విరాట్ కోహ్లీ కేవలం టీమిండియా కెప్టెన్ గానే తన అభిప్రాయాన్ని వ్యక్తం  చేశాడు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే అతడు ఈ వ్యాఖ్యలు చేశాడని భావిస్తున్నా. రవిశాస్త్రితో మంచి సంబంధాలున్నాయని...అతన్నే తిరిగి కోచ్ గా నియమిస్తే సంతోషిస్తామని మాత్రమే కోహ్లీ అన్నాడు. నియమించాలని డిమాండ్ చేయలేదు. ఈ విషయాన్ని అందురూ గుర్తించాలి.'' అంటూ కోహ్లీకి గంగూలీ మద్దతుగా నిలిచాడు. 

మరిన్ని వార్తలు

కోచ్ ఎంపికపై కోహ్లీ ఏమైనా మాట్లాడగలడు...కానీ మేమలా కాదు: అన్షుమన్‌ గైక్వాడ్‌

కోహ్లీ... బిసిసిఐ నిర్ణయాన్నే ప్రశ్నిస్తున్నావా...?: హర్షా బోగ్లే