విరాట్ కోహ్లీ కలిసి ఏడో వికెట్‌కి 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అశ్విన్...రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన జాక్ లీచ్...171 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా...

తొలి టెస్టులో భారత జట్టు ఓటమి దిశగా సాగుతోంది. 420 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా... 171 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. 46 బంతుల్లో 9 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్‌ను జాక్ లీచ్ అవుట్ చేశాడు. జాక్ లీచ్‌కి రెండో ఇన్నింగ్స్‌లో ఇది మూడో వికెట్ కావడం విశేషం. 

రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ కలిసి ఏడో వికెట్‌కి 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. విరాట్ కోహ్లీ 64 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇంగ్లాండ్ స్కోరుకి ఇంకా 249 పరుగుల దూరంలో ఉన్న టీమిండియా... టెస్టును డ్రా చేసుకోవాలన్నా ఇంకా 51 ఓవర్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.

టెయిలెండర్లతో విరాట్ కోహ్లీ ఎంత సేపు పోరాడతాడనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. చెన్నైలో నాలుగో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన మొట్టమొదటి కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ...