టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ యాక్షన్‌ను అనేక మంది అనుకరించడం తెలిసిందే. పదునైన యార్కర్లతో పాటు వైవిధ్యమైన బౌలింగ్‌తో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌‌గా అవతరించి ఎన్నోసార్లు భారత్‌కు చిరస్మరణీయమైన విజయాలు అందించాడు.

అలా దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా బుమ్రా బౌలింగ్ యాక్షన్‌ను ఓ క్రికెట్ అభిమాని తల్లి అనుకరించారు. దీనిని అతను సోషల్ మీడియాలో పెట్టడంతో క్షణాల్లో వైరల్ అయ్యింది.

యువత మాదిరిగానే.. పెద్దవాళ్లు కూడా ప్రపంచకప్‌లో బుమ్రా బౌలింగ్‌కు ఫిదా అయ్యారు. మా అమ్మ కూడా అతని శైలిని అనుకరించారంటూ సదరు క్రీడాభిమాని ట్వీట్ చేశాడు. ఇది బుమ్రా దృష్టికి వెళ్లడంతో అతను ఫిదా అయ్యాడు. మీ ఉత్సాహం నాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది అంటూ జస్ప్రీత్ రిప్లయ్ ఇచ్చాడు.