ఇండియా-పాకిస్థాన్...ఈ దాయాది దేశాల మధ్య వైరం మనకు తెలియంది కాదు. ఈ శతృత్వం కేవలం ఇది ఇరుదేశాల ద్వైపాక్షి సంబంధాలనే కాదు క్రికెట్ సంబంధాలను దెబ్బతీసింది. ముఖ్యంగా ముంబై  ఉగ్రదాడి తర్వాత ఈ దేశాల  మధ్య ద్వైపాక్షిక సీరీస్ లు పూర్తిగా నిలిచిపోయి ఆటగాళ్ల  మధ్య కూడా దూరం మరింత పెరిగిపోయింది. తాజాగా ప్రపంచ కప్ నేపథ్యంలో ఇరుదేశాలు చాలారోజుల తర్వాత మరోసారి తలపడనున్నాయి. దీంతో ఆటగాళ్ల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో ఓ పాక్ క్రికెటర్ తనకు టీమిండియా బౌలర్ బుమ్రా మంచి బ్రేక్ ఇచ్చాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

2017లో  ఇదే ఇంగ్లాండ్ వేదికగా జరిగిన చాంపియన్ ట్రోపీ ఫైనల్లో పాక్ బ్యాట్ మెన్ ఫకార్ జమాన్ అద్భుత సెంచరీ(114 పరుగులు) తో పాక్ ను గెలిపించిన విషయం తెలిసిందే. ఈ  మ్యాచ్ తర్వాత జమాన్ పాక్ జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయాడు. అయితే ఈ మ్యాచ్ భారత బౌలర్ బుమ్రా చేసిన తప్పిదమే ఆ తర్వాత తనకి మంచి అవకాశాలు వచ్చేలా చేసి ఇక్కడివరకు తీసుకువచ్చిందని జమాన్ పేర్కొన్నాడు. 

''2017 చాపింయన్స్ టోపీ ఫైనల్లో కీలకమైన సమయంలో నేను బ్యాటింగ్ కు దిగాను. అయితే అప్పటికే మంచి ఊపుమీదున్న బుమ్రా నన్ను కేవలం 3 పరుగుల వద్ద వుండగానే ఔట్ చేశాడు. అయితే ఆ బంతి నోబాల్ కావడంతో నాకు లైఫ్ లభించింది. ఇక ఆ తర్వాత నన్ను ఔట్ చేసే అవకాశం భారత బౌలర్లకు ఇవ్వకుండా జాగ్రత్తపడుతూసెంచరీ సాధించాను. ఈ మ్యాచ్ లో పాక్  180 పరుగుల భారీ తేడాతో భారత్ చిత్తు చేసి చాంపియన్ ట్రోపీని అందుకుంది. ఇలా బుమ్రా వేసిన నోబాల్ వల్లే నాటౌట్ గా నిలిచి సెంచరీ  సాధించాను. 

ఇలా ఈ మ్యాచ్ లో సెంచరీ సాధించడం ద్వారా నా రెండు కలలు నెరవేకరాయి.  ఒకటి నా ఆటతో తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలని  అనుకునేవాడిని. ఈ మ్యాచ్ తో ఆ కల నెరవేరింది. ఇక నోబాల్ కు ఔటవ్వాలనే డ్రీమ్ కూడా నాకుండేది. అది కూడా బుమ్రా ద్వారానే నెరవేరింది. ఈ మ్యాచ్ తర్వాతే నాకు గుర్తింపు, గౌరవం పెరిగి ఫేమన్ అయ్యాను'' అని జమాన్ వెల్లడించాడు.