TATA IPL 2022:  సీజన్ లో తమ తొలి మ్యాచులో అనూహ్య విజయాలు అందుకున్న రెండు జట్లు రెండో పోటీకి సిద్ధమయ్యాయి. పూణే వేదికగా జరుగుతున్న మ్యాచులో   విజయ యాత్రను కొనసాగించాలని భావిస్తున్నాయి.  

ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా ఇప్పటికే తొలి మ్యాచ్ ఆడేసిన ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ రెండో పోరుకు సిద్ధమయ్యాయి. ముంబైతో జరిగిన తొలి మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ అనూహ్య విజయాన్ని అందుకోగా.. లక్నోతో జరిగిన మ్యాచులో గుజరాత్ కూడా దాదాపు అదే తరహా గెలుపును సాధించింది. ఇప్పుడు ఈ రెండు జట్లు పూణే వేదికగా తలపడుతున్నాయి. గత మ్యాచులో ఇచ్చిన కిక్ తో బరిలోకి దిగుతున్న రెండు జట్లు.. మలి విజయం కోసం తహతహలాడుతన్నాయి. కాగా టాస్ నెగ్గిన రిషభ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ కు రానుంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ తప్ప టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన జట్లన్నీ గెలుపొందాయి. మరి ఈ మ్యచులో కూడా అదే సీన్ రిపీటయ్యేనా..

ముంబైతో జరిగిన గత మ్యాచులో భారీ లక్ష్య ఛేదనలో క 100 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినప్పటికీ ఢిల్లీ పుంజుకున్న తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. లలిత్ యాదవ్ తో పాటు శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ లు ఆ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. 

బలబలాల పరంగా గుజరాత్ కంటే ఢిల్లీనే బలంగా కనిపిస్తున్నది. పృథ్వీ షా, టిమ్ సీఫర్ట్, రిషభ్ పంత్, లలిత్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. ఇక గుజరాత్ లో శుభమన్ గిల్, మాథ్యూ వేడ్, హార్థిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా వంటి హిట్టర్లున్నారు. 

Scroll to load tweet…

బౌలింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ముస్తాఫిజర్ రెహ్మన్, ఖలీల్ అహ్మద్ వంటి ఫాస్ట్ బౌలర్లతో పాటు కుల్దీప్ యాదవ్ (గత మ్యాచులో 4 వికెట్లు), అక్షర్ పటేల్ వంటి స్పిన్నర్లు కూడా ఉన్నారు. ఇక గుజరాత్ కు మహ్మద్ షమీ, వరుణ్ ఆరోన్, ఫెర్గూసన్ వంటి స్పీడ్ స్టార్లతో పాటు రషీద్ ఖాన్ వంటి అనుభవజ్ఞుడైన స్పిన్నర్ ఉన్నాడు.

తుది జట్లు : 

ఢిల్లీ క్యాపిటల్స్ : పృథ్వీ షా, టిమ్ సీఫర్ట్, మన్దీప్ సింగ్, రిషభ్ పంత్ (కెప్టెన్), లలిత్ యాదవ్, రోవ్మాన్ పావెల్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ 

గుజరాత్ టైటాన్స్ : శుభమన్ గిల్, మాథ్యూ వేడ్, విజయ్ శంకర్, హార్థిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ ఆరోన్, మహ్మద్ షమీ