మరో ఓవర్ మిగిలి ఉండగానే 206 పరుగుల టార్గెట్‌ను ఊదేసింది పంజాబ్ కింగ్స్.
- Home
- Sports
- Cricket
- TATA IPL PBKS vs RCB: ఆర్సీబీ రాత మార్చలేకపోయిన డుప్లిసిస్... హై స్కోరింగ్ గేమ్‌లో...
TATA IPL PBKS vs RCB: ఆర్సీబీ రాత మార్చలేకపోయిన డుప్లిసిస్... హై స్కోరింగ్ గేమ్‌లో...

TATA IPL2022 PBKS vs RCB Live: ఐపీఎల్-2022 లో భాగంగా పంజాబ్ కింగ్స్ - రాయల్ ఛాలెంజర్స్ మధ్య డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచులో మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని పీబీకేఎస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గత సీజన్ లో కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఆర్సీబీకి కొత్త సారథిగా వ్యవహరిస్తున్నాడు ఫాఫ్ డుప్లెసిస్. ఇద్దరు కొత్త కెప్టెన్లు తమ తొలి మ్యాచులో ఎలా రాణిస్తారో చూడాల్సిందే మరి..
మరో ఓవర్ ఉండగానే...
మలుపు తిప్పిన స్మిత్...
సిరాజ్ వేసిన 18వ ఓవర్‌లో మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 25 పరుగులు రాబట్టాడు ఓడియన్ స్మిత్. దీంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. హర్షల్ పటేల్ వేసిన 19వ ఓవర్‌లో సిక్సర్ బాదిన షారుక్ ఖాన్, లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఓడియన్ స్మిత్ 8 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 25 పరుగులు చేయగా, షారుక్ ఖాన్ 20 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 24 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...
11.5 కోట్లకు 19 పరుగులే...
అండర్19 ఆల్‌రౌండర్ రాజ్ భవను గోల్డెన్ డకౌట్ చేశాడు మహ్మద్ సిరాజ్.. ఐపీఎల్ 2022 సీజన్‌లో భారీ ధర దక్కించుకున్న లియామ్ లివింగ్‌స్టోన్ 10 బంతుల్లో 2 సిక్సర్లతో 19 పరుగులు చేసి నిరాశపరిచినా... షారుక్ ఖాన్, ఓడియన్ స్మిత్ కలిసి పంజాబ్ కింగ్స్‌ను విజయ తీరాలకు చేర్చారు...
రాజువయ్యా... మహరాజువయ్యా...
29 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 43 పరుగులు చేసిన శిఖర్ ధావన్, హర్షల్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. భనుక రాజపక్ష 22 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
ఓపెనింగ్ అదిరింది...
భారీ లక్ష్యఛేదనలో మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్ కలిసి తొలి వికెట్‌కి 71 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్‌ను వానిందు హసరంగ పెవిలియన్ చేర్చాడు...
మయాంక్‌కి తొలి విజయం...
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 205 పరుగుల భారీ స్కోరు చేస్తే, ఆ లక్ష్యాన్ని ఈజీగా ఛేదించేసి... అద్భుత విజయాన్ని అందుకుంది పంజాబ్ కింగ్స్... కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్‌కి ఇది తొలి విజయం కాగా, ఫాఫ్ డుప్లిసిస్ పరాజయంతో ఆర్‌సీబీ కెప్టెన్‌గా కెరీర్ మొదలెట్టాడు...
పైసా వసూల్..
ఐపీఎల్ 2022 సీజన్‌లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్, క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించింది.
రెండు వందలు దాటిన బెంగళూరు.. పంజాబ్ లక్ష్యమిదే..
పంజాబ్ తో జరుగుతున్న మ్యాచులో ఇన్నింగ్స్ ను నెమ్మదిగా ఆరంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ముగింపును మాత్రం ఘనంగా ముగించింది. పన్నెండో ఓవర్ తర్వాత డుప్లెసిస్ గేర్ మార్చి సిక్సర్లతో విరుచుకుపడితే.. ఆఖర్లో వచ్చిన దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 32 నాటౌట్ .. 3 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. విరాట్ కోహ్లి (29 బంతుల్లో 41 నాటౌట్.. 1 ఫోర్, 2 సిక్సర్లు) నాటౌట్ గా నిలిచాడు. డుప్లెసిస్, దినేశ్ కార్తీక్, విరాట్ కోహ్లి ల వీర విహారంతో ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఈ సీజన్ లో 200 పరుగులు దాటిన జట్టుగా ఆర్సీబీ రికార్డు సృష్టించింది. ఇక ఈ మ్యాచులో గెలవాలంటే పంజాబ్ కింగ్స్.. 206 పరుగులు చేయాలి.
డీవై పాటిల్ లో సిక్సర్లు, ఫోర్ల వర్షం
ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురుస్తున్నది. డుప్లెసిస్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ (9 బంతుల్లో18 .. ఒక ఫోర్, రెండు సిక్సర్లు) కూడా దుమ్ము రేపుతున్నాడు. ఓడియన్ స్మిత్ ను లక్ష్యంగా చేసుకున్న కార్తీక్.. అతడు వేసిన 19వ ఓవర్లో రెండు సిక్సర్లు, ఫోర్ బాదాడు. 19 ఓవర్ ముగిసేసరికి ఆర్సీబీ 2 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.
డుప్లెసిస్ ఔట్..
ఆర్సీబీ కెప్టెన్ గా తొలి ఇన్నింగ్స్ లోనే సూపర్ ఇన్నింగ్స్ ఆడిన డుప్లెసిస్.. (57 బంతుల్లో 88.. 3 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీ దిశగా సాగే క్రమంలో సందీప్ సింగ్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి షారుఖ్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మరోవైపు కోహ్లి (26 బంతుల్లో 38), దినేశ్ కార్తీక్ క్రీజులో ఉన్నారు.
దండయాత్ర ఇది డుప్లెసిస్ దండయాత్ర
ఆర్సీబీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ పంజాబ్ బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. క్రీజులో కుదురుకున్నాక ఓవర్ కు ఓ సిక్సర్ చొప్పున బాదుతున్న బెంగళూరు కెప్టెన్.. 16 ఓవర్ లో రెండు సార్లు బంతిని స్టాండ్స్ లోకి పంపాడు. 30 బంతుల్లో 15 పరగులు కూడా చేయని ఫాఫ్.. తర్వాత గేర్ మార్చి కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 16 ఓవర్లు ముగిసేసరికి డుప్లెసిస్.. 53 బంతుల్లో 82 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, ఏడు సిక్సర్లున్నాయి.
15 ఓవర్లకు బెంగళూరు స్కోరు ఇదే..
ఆరంభంలో ఆచితూచి ఆడిన ఆర్సీబీ.. తర్వాత విరుచుకుపడుతున్నది. పది ఓవర్లలో 70 పరుగులే చేసిన బెంగళూరు.. గత 20 బంతుల్లో ఏకంగా 60 పరుగులు రాబట్టింది. డుప్లెసిస్ (49 బంతుల్లో 68 నాటౌట్, 2 ఫోర్లు, 5 సిక్సర్లు), విరాట్ కోహ్లి (21 బంతుల్లో 32 నాటౌట్.. ఒక ఫోర్, 2 సిక్సర్లు) రెండో వికెట్ కు 92 పరుగులు జోడించి క్రీజులో కొనసాగుతున్నారు. 15 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ.. వికెట్ నష్టానికి 142 పరుగులు చేసింది.
వంద దాటిన ఆర్సీబీ.. డుప్లెసిస్ హాఫ్ సెంచరీ
ఆర్సీబీ గేర్ మార్చింది. ఇప్పటిదాకా నిదానంగా ఆడిన బెంగళూరు.. ఉన్నట్టుండి హిట్టింగ్ కు దిగింది. లివింగ్ స్టోన్ వేసిన 12వ ఓవర్లో డుప్లెసిస్.. సిక్సర్ బాదాడు. ఆ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. ఇక ఆ తర్వాత ఓవర్ వేసిన ఓడియన్ స్మిత్ కు కోహ్లి, డుప్లెసిస్ చుక్కలు చూపించారు. ఆ ఓవర్లో తొలి బంతికి కోహ్లి ఫోర్ కొట్టాడు. అదే ఓవర్లో డుప్లెసిస్ వరుస బంతుల్లో ఫోర్, రెండు సిక్సర్ల తో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 13 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది.
పది ఓవర్లకు ఆర్సీబీ స్కోరు ఎంతంటే..
పది ఓవర్లు ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (14 నాటౌట్), ఫాఫ్ డుప్లెసిస్ (17 నాటౌట్) ఆడుతున్నారు. హర్ప్రీత్ బ్రర్ వేసిన పదో ఓవర్లో నాలుగో బంతికి విరాట్ కోహ్లి సిక్సర్ కొట్టాడు.
తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. క్రీజులోకొచ్చిన కింగ్ కోహ్లి
పరుగులు చేయడానికి ఇబ్బందులు పడ్డ ఆర్సీబీ బ్యాటర్ అనూజ్ రావత్ (21) ను పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ రాహుల్ చాహర్ అద్భుత డెలివరీతో బౌల్డ్ చేశాడు. అనూజ్ ఔటవ్వడంతో కింగ్ కోహ్లి క్రీజులోకి వచ్చాడు. డుప్లెసిస్ (15 నాటౌట్) తో కలిసి కోహ్లి (2 నాటౌట్) క్రీజులో ఉన్నారు. 7 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ స్కోరు ఒక వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది.
పీబీకేఎస్ సూపర్ బౌలింగ్.. పరుగుల కోసం కష్టపడుతున్న ఆర్సీబీ
మయాంక్ అగర్వాల్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ బౌలింగ్ లో అదరగొడుతున్నది. ఇప్పటివరకు ఆరు ఓవర్లు ముగియగా.. ఆర్సీబీ బ్యాటర్లు రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు మాత్రమే కొట్టగలిగారు. ఆరంభం నుంచే వీరవిహారం చేసే ఫాఫ్ డుప్లెసిస్.. 19 బంతుల్లో 10 పరుగులే చేశాడు. అనూజ్ రావత్.. 17 బంతుల్లో 15 పరుగులు చేశాడు. తొలి పవర్ ప్లే ముగిసేసరికి ఆర్సీబీ.. వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది.
ఆచితూచి ఆడుతున్న ఆర్సీబీ..
ముంబై లోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా పీబీకేఎస్-ఆర్సీబీ మధ్య జరుగుతున్న మ్యాచులో బెంగళూరు ఆచితూచి ఆడుతున్నది. ఆర్సీబీ సారథి డుప్లెసిస్ తన సహజ శైలికి భిన్నంగా నిదానంగా ఆడుతున్నాడు. 13 బంతులు ఎదుర్కున్న అతడు.. 6 పరుగులు మాత్రమే చేశాడు. అతడితో ఓపెనింగ్ కు వచ్చిన అనూజ్ రావత్... 5 బంతుల్లో 6 పరుగులు చేశాడు. 3 ఓవర్లకు ఆర్సీబీ.. 23 పరుగులు చేసింది. ఎక్స్ట్రాల రూపంలోనే 11 పరుగులు రావడం విశేషం.