TATA IPL 2022 - RR vs KKR: గతేడాది ఐపీఎల్ రన్నరప్ కోల్కతా నైట్ రైడర్స్, ఐపీఎల్ తొలి సీజన్ విజేత రాజస్తాన్ రాయల్స్ మధ్య బ్రబోర్న్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరుగుతన్నది.  ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ బౌలింగ్ ఎంచుకుంది. 

విజయంతో ఐపీఎల్ కొత్త సీజన్ ను ప్రారంభించిన కోల్కతా నైట్ రైడర్స్.. తర్వాత కాస్త వెనుకబడింది. చెన్నై తో గెలిచి తర్వాత బెంగళూరుతో ఓడినా తిరిగి పంజాబ్, ముంబై లను ఓడించింది. అయితే మళ్లీ ఢిల్లీ, హైదరాబాద్ చేతిలో ఓడి పరాజయాల బాట పట్టింది. ఇక రాజస్తాన్ రాయల్స్ పరిస్థితి కూడా అంతే.. తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ ను ఓడించిన ఆ జట్టు.. తర్వాత ముంబైపై కూడా గెలిచింది. కానీ తర్వాత బెంగళూరు చేతిలో ఓడి, లక్నో పై ఉత్కంఠ పోరులో గెలిచి గుజరాత్ చేతిలో ఓడింది. పడుతూ లేస్తూ వస్తున్న ఈ రెండు జట్లు నేడు ముంబై లోని బ్రబోర్న్ స్టేడియం వేదికగా ఢీకొనబోతున్నాయి. 

బ్రబోర్న్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. రాజస్తాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్ కు రానుంది. ఈ రెండు జట్లు ఆడిన ఆఖరి మ్యాచులు ఓడిపోయాయి. తిరిగి విజయాల బాట పట్టేందుకు రెండు జట్లు కృషి చేస్తున్నాయి.

ఇక ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లలో పలు మార్పులు జరిగాయి. కోల్కతా నైట్ రైడర్స్ తరఫున అమన్ ఖాన్ స్థానంలో శివమ్ మావి ఆడుతున్నాడు. ఇక రాజస్తాన్ రాయల్స్ లో మూడు మార్పులు జరిగాయి. కరుణ్ నాయర్, ఓమెడ్ మెక్ కాయ్, ట్రెంట్ బౌల్ట్ లు తుది జట్టులోకి వచ్చారు. 

Scroll to load tweet…

ముఖాముఖి: ఐపీఎల్ లో ఈ రెండు జట్లు ఇప్పటివరకూ 24 సార్లు పోటీ పడ్డాయి. ఇందులో కేకేఆర్ 13 సార్లు గెలవగా.. రాజస్తాన్ 11 మ్యాచుల్లో నెగ్గింది. అయితే 2018 నుంచి ఈ రెండు జట్ల మధ్య 9 మ్యాచులు జరుగగా అందులో కేకేఆర్ ఏకంగా ఏడు మ్యాచుల్లో గెలవడం గమనార్హం. 

జట్లు : 

రాజస్తాన్ రాయల్స్ : జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజూ శాంసన్ (కెప్టెన్), కరుణ్ నాయర్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, రియాన్ పరాగ్, ట్రెంట్ బౌల్ట్, ఒబెడ్ మెక్ కాయ్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్ 

కోల్కతా నైట్ రైడర్స్ : ఆరోన్ ఫించ్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీశ్ రాణా, ఆండ్రూ రసెల్, షెల్డన్ జాక్సన్, పాట్ కమిన్స్, సునీల్ నరైన్, ఉమేశ్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి