టీ20 వరల్డ్ కప్ 2024 : ఐర్లాండ్ తో భారత్ తొలిపోరు.. అదే జరిగితే కష్టమే..
IND vs IRE: టీ20 ప్రపంచకప్ 2024లో భారత జట్టు తన తొలి పోరులో ఐర్లాండ్ తో తలపడనుంది. ఐర్లాండ్ అనేక సార్లు దిగ్గజ జట్లకు సైతం షాకిచ్చింది. ఇక న్యూయార్క్ స్టేడియం పిచ్ అసలు మజాను అందించనుందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
IND vs IRE: అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ తో తలపడనుంది. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8 గంటలకు జరిగే ఈ మ్యాచ్ లో మన ప్లేయర్లు ఏలా ఆడతారనే ఆసక్తి నెలకొంది. జట్ల పరంగా చూస్తూ భారత్ దే పైచేయి కానీ, ఐర్లాండ్ ను అంత తక్కువగా అంచనా వేయలేము. ఎందుకంటే చాలా సార్లు ఐరీష్ జట్లు దిగ్గజ జట్లకు బలమైన పోటీని ఇవ్వడంతో పాటు తనదైన స్టైల్లో అదరగొట్టి ప్రత్యర్థి జట్లకు షాకిచ్చింది.
గత 3 ఐసీసీ ట్రోఫీల్లో భారత జట్టు ప్రదర్శన మెరుగ్గానే ఉన్నా కీలకమైన మ్యాచ్ లో డీలాపడ్డ సందర్భాలు ఉన్నాయి. 2022 టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా సెమీ-ఫైనల్‌లో ఓడిపోయింది. గతేడాది జరిగిన వన్డే ప్రపంచ కప్ 2023 లో ఫైనల్లో, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో రోహిత్ సేన ఒక అడుగు దూరంలో నిలిచిపోయింది. అయితే, ఈ సారి ఎలాగైనా ట్రోఫీతోనే తిరిగిరావాలని అమెరికా గడ్డపై అడుగుపెట్టింది భారత్.
ఐర్లాండ్ ను తేలిగ్గా తీసుకుంటే మాత్రం..
టీమిండియా ముందున్న సవాల్ ఐర్లాండ్. జూన్ 5న నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. కానీ ఈ మ్యాచ్‌కు ముందు భారత్ ముందున్న రెండు కీలకమైన విషయాలను ఇప్పటికే పరిష్కరించినట్టు తెలుస్తోంది. వాటిలో మొదటిడి పిచ్‌లో డ్రాప్‌పై ప్లాన్, రెండవది ప్లేయింగ్ 11లో ఏవరుండాలనేది. ఇప్పటివరకు ఐర్లాండ్‌పై టీమిండియాదే పైచేయి.. కానీ, ఐర్లాండ్‌ను తక్కువ అంచనా వేయడం కుదరదు. ఎందుకంటే గతంలో ఛాంపియన్ జట్టు ఇంగ్లాండ్ ఓడించింది. తాజాగా ఈ జట్టు పాకిస్థాన్‌ను ఓడించి సంచలనం సృష్టించింది.
సూపర్ 8 కు చేరుకున్న ఐర్లాండ్..
2007లో టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా టైటిల్ గెలిచింది. 2 సంవత్సరాల తర్వాత, ఐర్లాండ్ సూపర్-8 వరకు ప్రయాణించింది. 2022లో ట్రోఫీ కల చెదిరిపోయిన తర్వాత టీ20 ప్రపంచకప్ ట్రోఫీయే భారత జట్టు అసలు లక్ష్యం. ఈ ఏడాది ప్రారంభంలో, ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌ను భారత్ ఆడింది, ఇందులో భారత్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. దాని తర్వాత ఇప్పుడు భారత జట్టు నేరుగా టీ20 ప్రపంచ కప్ లో ఆడుతోంది.
పిచ్ ఎలా ఉండబోతోంది?
న్యూయార్క్‌లో డ్రాప్ ఇన్ పిచ్‌లను ఉపయోగిస్తున్నారు. నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత జట్టు మ్యాచ్ ఆడనుంది. తొలి మ్యాచ్‌లో చాలా తక్కువ స్కోరు నమోదైంది. ఈ పిచ్‌పై బ్యాట్స్‌మెన్ ఒక్కో పరుగు కోసం కష్టపడుతున్నారు. ఫలితంగా శ్రీలంక జట్టు కేవలం 77 పరుగుల స్కోరుకే కుప్పకూలగా, దక్షిణాఫ్రికా వంటి జట్టు కూడా స్వల్ప లక్ష్యం కోసం కష్టపడాల్సి వచ్చింది. ఈ పిచ్‌లో భారత్ - ఐర్లాండ్ మధ్య జరిగే మ్యాచ్ లో తక్కువ స్కోరింగ్ నమోదుకావచ్చు.
రెండు జట్ల అంచనాలు ఇలా..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా.
ఐర్లాండ్ : పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, ఆండ్రూ బల్బిర్నీ, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, గ్రాహం హ్యూమ్, జాషువా లిటిల్, బారీ మెక్‌కార్తీ, నీల్ రాక్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.
టీమిండియా ప్రధాన కోచ్.. ఎట్టకేలకు మౌనం వీడిన గౌతమ్ గంభీర్.. ఏం చెప్పాడంటే..?