టీ20 వరల్డ్ కప్ 2022 సెమీ ఫైనల్ 1: టాస్ గెలిచిన న్యూజిలాండ్... ఆ రికార్డునే నమ్ముకున్న పాక్...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్... కివీస్‌పై మెరుగైన రికార్డు ఉన్న పాకిస్తాన్...

T20 World cup 2022 New Zealand vs Pakistan 1st Semi finals: Pakistan won the toss elected to bat first

సిడ్నీ గ్రౌండ్‌లో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ మొదటి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియంసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కొన్నేళ్లుగా ఐసీసీ టోర్నీల్లో అంచనాలు లేకుండా బరిలో దిగి, ఫైనల్ చేరుతూ వస్తోంది న్యూజిలాండ్...

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2015, 2019 టోర్నీలతో పాటు టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలోనూ ఫైనల్ చేరింది న్యూజిలాండ్. అయితే వరల్డ్ కప్ టోర్నీల్లో ఆఖరి మెట్టుపై బోల్తా పడి న్యూజిలాండ్, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియాని ఓడించి... 20 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ కైవసం చేసుకుంది...

మరోవైపు మొదటి మ్యాచ్‌లో టీమిండియా, ఆ తర్వాత జింబాబ్వేతో మ్యాచుల్లో ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి ఓడిన పాకిస్తాన్, అన్యూహ్యంగా లక్‌ కలిసి వచ్చి సెమీ ఫైనల్‌కి అర్హత సాధించింది. నెదర్లాండ్స్ జట్టు, సౌతాఫ్రికాకి షాక్ ఇవ్వడంతో 6 పాయింట్లతో మెరుగైన రన్‌రేటుతో ఉన్న పాకిస్తాన్... సెమీ ఫైనల్‌కి అర్హత సాధించింది...

గ్రూప్ 1లో 7 పాయింట్లతో ఉన్న ఆస్ట్రేలియా, నెట్ రన్ రేట్ తక్కువగా ఉండడంతో సెమీస్‌కి అర్హత సాధించలేకపోయింది. గ్రూప్ 2లో మాత్రం 6 పాయింట్లతో ఉన్న పాకిస్తాన్, నెట్ రన్ రేట్ కారణంగా సెమీ ఫైనల్‌కి వచ్చేసింది...
 
పాకిస్తాన్ జట్టు: మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్, మహ్మద్ హారీస్, షాన్ మసూద్, ఇఫ్తికర్ అహ్మద్, షాదబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీం షా, హారీస్ రౌఫ్, షాహీన్ ఆఫ్రిదీ

న్యూజిలాండ్ జట్టు: ఫిన్ ఆలెన్, డివాన్ కాన్వే, కేన్ విలియంసన్, గ్లెన్ ఫిలిప్స్, డార్ల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఇష్ సోధీ, లూకీ ఫర్గూసన్, ట్రెంట్ బౌల్ట్ 

టీమిండియా, కివీస్‌పై ఐసీసీ మ్యాచులు గెలవడానికి అష్టకష్టాలు పడుతుంటే పాకిస్తాన్ మాత్రం ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్‌కి చుక్కలు చూపిస్తోంది.. 1983 వన్డే వరల్డ్ కప్‌లో, 1992, 1996, 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లోనూ న్యూజిలాండ్ జట్టును చిత్తుగా ఓడించింది పాకిస్తాన్...  టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లోనూ న్యూజిలాండ్‌పై పాకిస్తాన్‌కి తిరుగులేని రికార్డు ఉంది.టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు ఆరుసార్లు తలబడ్డాయి. ఇందులో నాలుగు సార్లు పాక్ గెలిస్తే, రెండు సార్లు న్యూజిలాండ్ గెలిచింది...

2007 టీ20 వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్ చేతుల్లో ఓడింది కివీస్. 2009 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 99 పరుగులకే ఆలౌట్ అయ్యింది న్యూజిలాండ్. ఈ లక్ష్యాన్ని పాక్ 13.1 ఓవర్లలో ఛేదించింది...2010 టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్, పాకిస్తాన్‌పై 1 పరుగు తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. 134 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన పాక్, 132 పరుగులకు పరిమితమై 1 పరుగు తేడాతో ఓడింది. 2012 టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై 13 పరుగుల తేడాతో విజయం అందుకుంది పాకిస్తాన్...

2016 టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్, పాకిస్తాన్‌పై 22 పరుగుల తేడాతో  గెలిచింది. 2021 టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి టేబుల్ టాపర్‌గా సెమీస్‌కి అర్హత సాధించింది పాకిస్తాన్... న్యూజిలాండ్ ప్రస్తుతమున్న ఫామ్ చూస్తే ఆ జట్టును ఓడించడం కొంచెం కష్టమే. అయితే తొలి రెండు మ్యాచుల్లో ఘోర పరాజయాల తర్వాత అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చిన పాకిస్తాన్ ఎప్పుడూ ఎలా ఆడుతుందో చెప్పలేం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios