టి20 ప్రపంచ కప్ వాయిదా, రేపు అధికారిక ప్రకటన చేయనున్న ఐసీసీ

టి20 ప్రపంచకప్‌ వాయిదా, రద్దుకావడం ఖాయంగా కనబడుతోంది. ఇందుకు సంబంధించి రేపు ఐసీసీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసీసీ) మే 26-28మధ్య టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యులతోపాటు అన్ని క్రికెట్‌ బోర్డులతో జరుప తలపెట్టిన సమావేశం నిన్న ప్రారంభమయింది.  

 

T20 World Cup, 2020 To Be Postponed, ICC Likely To Make Official Announcement Tomorrow

టి20 ప్రపంచకప్‌ వాయిదా, ఖాయంగా కనబడుతోంది. ఇందుకు సంబంధించి రేపు ఐసీసీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసీసీ) మే 26-28మధ్య టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యులతోపాటు అన్ని క్రికెట్‌ బోర్డులతో జరుప తలపెట్టిన సమావేశం నిన్న ప్రారంభమయింది.  

ఆ సమావేశంలోనే టి20 ప్రపంచకప్‌ టోర్నీ సుదీర్ఘ చర్చ జరగనున్నట్లు సమాచారం. ఇంకా ఐసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్ల దాఖలు తేదీలను, ఎన్నికలను ఖరారు చేయనుంది. ఏకగ్రీవం కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు ఎలా జరపాలన్న విషయాన్నీ కూడా ఐసీసీ ఈ సమావేశంలోనే చర్చించనుంది. 

టి20 వరల్డ్‌కప్‌ను వాయిదా వేయాలని చాలాదేశాల క్రికెట్‌బోర్డులు ఐసీసీిపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. కోవిడ్‌-19 కారణంగా అన్ని దేశాల క్రికెట్‌ బోర్డులు భారీ నష్టాల్లో కూరుకుపోయి, ఆటగాళ్లకు కనీసం జీతాలు చెల్లించలేకపోతున్న విషయం తెలిసిందే. అలా జరిగితే క్రికెట్‌ సీజన్‌ ఇండియన్‌ ప్రిమియర్‌లీగ్‌(ఐపీఎల్‌)తో ప్రారంభమైతే అన్ని బోర్డులు ఆర్థికంగా పుంజుకొనే అవకాశముందని మాజీ క్రికెటర్లు అంటున్నారు. 

అక్టోబర్‌-నవంబర్‌లో ఐపీఎల్‌ నిర్వహిస్తే ఆటగాళ్లతోపాటు అన్ని దేశాల క్రికెట్‌బోర్డులు ఆర్థికంగా పుంజుకుంటాయని వారు అంటున్నారు. ప్రస్తుత పరిణామాలను నిశితంగా గమనిస్తున్న బీసీసీఐ.. ఐసీసీ ప్రకటన అనంతరమే ఐపీఎల్‌ సీజన్‌-13పై తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. 

పరిస్థితులు అనుకూలించకపోతే యూఏఈలోనైనా లీగ్‌ను నిర్వహించడానికి బోర్డు ప్రణాళికలను సిద్ధం చేస్తోందని తెలిసింది. ప్రపంచ క్రికెట్‌ అడ్మినిస్ట్రేటర్స్‌, ఐసిసి కూడా ఆతిథ్య క్రికెట్‌ ఆస్ట్రేలియా నిర్ణయానికై వేచిచూస్తోంది. 

ఈ క్రమంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఐసీసీ ముందు మూడు ప్రతిపాదనలు పెట్టినట్టు తెలియవస్తుంది. మొదటగా, టి20 ప్రపంచకప్‌ను ఫిబ్రవరి-మార్చికి వాయిదా వేసి.. ఇంగ్లండ్‌, భారత్‌ సిరీస్‌లను యథాతథంగా కొనసాగించాలి. ఇలా చేస్తే వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఐపిఎల్‌ ప్రారంభం కావాల్సి ఉంది. ఐసిసి ఫ్యూచర్‌ టూర్‌ ప్రోగ్రామ్‌(ఎఫ్‌టిపి)ని కూడా సవరించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయానికి బ్రాడ్‌కాస్టర్స్‌ కూడా సుముఖంగా లేనట్లు తెలిసింది. 

రెండవది,  ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌ ఆతిథ్య హక్కులను ఆస్ట్రేలియా వదులుకుంటే బిసీసీఐ 2021 మెగా టోర్నీ హక్కులు ఆసీస్‌కు ఇచ్చేలా.. పోటీదారు లేకుండా ఐసీసీ 2022 ఆతిథ్య హక్కులు భారత్‌ అప్పగించేలా. ఈ నిర్ణయానికి బిసీసీఐ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. 

మూడవది, అక్టోబర్‌లో జరగాల్సిన టి20 ప్రపంచకప్‌ను ఆసీస్‌ రద్దు చేసుకుంటే నేరుగా 2022 మెగా టోర్నీ ఆతిథ్య హక్కులు ఐసీసీ ఆస్ట్రేలియాకు అప్పగించేలా. దీంతో ఐసీసీ షెడ్యూల్‌లో కూడా పెద్దగా మార్పులు చోటు చేసుకోకపోవచ్చు.  

ఈ అన్ని పరిస్థితులను క్షుణ్ణంగా గమనించిన ఐసీసీ టి20 ప్రపంచ కప్ ను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు తెలియవస్తుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios