అంబటి రాయుడు మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా షెల్డన్ జాక్సన్, రాయుడుల మధ్య వాగ్వాదం ఇప్పుడు వైరల్ గా మారింది. 

సీనియర్ క్రికెటర్ అంబటి రాయుడిది మైదానంలో దూకుడుగా ఉండే స్వభావం. అయితే ఆ దూకుడే రాయుడుకు కొన్నిసార్లు చేటు తెచ్చేలా చేస్తుంది. తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా షెల్డన్ జాక్సన్, రాయుడుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. బరోడా తరఫున అంబటి రాయుడు ఆడుతుండగా, షెల్డన్ జాక్సన్ సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. షెల్డన్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో రాయుడు ఏదో చెబుతుండగా వారి మధ్య చిన్నపాటి వాదులాట చోటు చేసుకుంది. అయితే, అంపైర్లు, సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకుని వారికి సర్ది చెప్పారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇదిలా ఉండగా, ఈ ఏడాది అత్యంత చెత్త ఆటతీరుతో ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ .. తమపై ఉన్న ఆ టెన్షన్ మళ్లించేందుకు కొత్త డ్రామా మొదలు పెట్టిందని మే నెలలో పెద్ద దుమారమే చెలరేగింది. అప్పటికే కెప్టెన్సీ మార్పు విషయంలో విమర్శల పాలైన ఆ జట్టు.. తాజాగా మరో డ్రామకు తెరతీసిందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. అయితే, ఈ డ్రామాలో పావుగా మారింది అంబటి రాయుడు. తాజాగా అతడు రిటైర్మెంట్ ప్రకటన చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. పన్నెండేళ్లుగా ఐపీఎల్ ఆడిన తాను ఇక సెలవు తీసుకుంటాను అని.. ఇదే తన చివరి సీజన్ అని మే14న మధ్యాహ్నం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు. ఆ తరువాత పదిహేను నిమిషాలకే దాన్ని డిలీట్ చేశాడు. 

ప్రపంచకప్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్లకు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిన ఆసీస్.. సిరీస్ గోవిందా..

ఇది వైరల్ అయి, వివాదాస్పదంగా మారడంతో ఈ విషయంపై సిఎస్కే సీఈఓ కాశీవిశ్వనాథన్ స్పందించాడు. ఆయన స్పందిస్తూ.. ‘లేదు.. రాయుడు రిటైర్ కావడం లేదు. అతడు తన ప్రదర్శనలతో సంతృప్తిగా లేడేమో. ఒత్తిడికి గురయ్యే అలా ట్వీట్ చేశాడేమో.. అది ఒక సైకలాజికల్ చర్య.. నేను చెబుతున్నాను.. అతను మాతోనే ఉన్నాడు.. ఉంటాడు కూడా.. అని కుండబద్దలు కొట్టాడు. మే 14 మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల సమయంలో రాయుడు ట్వీట్ చేశాడు. ఆ తర్వాత పదిహేను నిమిషాలకే డిలీట్ చేశాడు. ఈ ట్వీట్ లో ఐపీఎల్లో ఇదే నా ఆఖరు సీజన్ అని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. ఐపీఎల్ లో గొప్ప జట్టైన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహించినందుకు సంతోషంగా ఉంది. ఆ రెండు జట్లతో గొప్ప క్షణాలు గడిపాను. ముంబై సిఎస్కుకే హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్నాడు. 

Scroll to load tweet…