పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడం వల్ల ఫలితం తేలుతుందా? తేలదా? అని భావించిన సిడ్నీ టెస్టు ఆసక్తికరంగా మారింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి పరుగులు చేసింది టీమిండియా. శుబ్‌మన్ గిల్ 50 పరుగులు చేసి అవుట్ కాగా, రోహిత్ శర్మ 26 పరుగులు చేశాడు.

సిరీస్‌లో మొట్టమొదటిసారి టీమిండియాకి మొదటి వికెట్‌కి 50+ భాగస్వామ్యం నమోదుకాగా 15 పరుగుల తేడాతో ఇద్దరు ఓపెనర్లను కోల్పోయింది టీమిండియా. 77 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసి అవుట్ కాగా... యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్ 101 బంతుల్లో 8 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేసి పెవిలియన్ చేరాడు.

85 పరుగులకి 2 వికెట్లు కోల్పోగా... ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే కలిసి 13 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 11 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పూజారా 53 బంతుల్లో 9 పరుగులు చేయగా, రహానే 40 బంతుల్లో 5 పరుగులు చేశాడు. వర్షం కారణంగా మొదటి రోజు 35 ఓవర్లు నష్టపోవడంతో కీలకమైన మూడో రోజు అరగంట ముందు ఆట ప్రారంభం కానుంది.