సిడ్నీలో మూడో రోజు మూడో సెషన్‌లో భారత ప్లేయర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రాలపై అసభ్యకర పదజాలంతో దూషించిన ఆస్ట్రేలియా ప్రేక్షకులు... నాలుగోరోజు మరోసారి నోటికి పని చెప్పారు. రెండో సెషన్‌లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ సిరాజ్‌ను కామెంట్ చేశారు. దీంతో సిరాజ్, అంపైర్లను ఆశ్రయించి మరోసారి ఫిర్యాదు చేశాడు.

సిరాజ్ ఫిర్యాదుతో కాసేపు చర్చించుకున్న అంపైర్లు... ఆటను కాసేపు నిలిపివేసి పోలీసులను రంగంలోకి దింపారు. తనపై కామెంట్ చేసిన వారిని సిరాజ్ గుర్తించడంతో వారిని నిలదీసిన పోలీసులు... స్టేడియం నుంచి వెళ్లిపోవాల్సిందిగా సూచించారు.

క్రికెటర్లపై రేసిజం కామెంట్లు చేసే ప్రేక్షకులను స్టేడియానికి రాకుండా జీవితకాలం నిషేధం విధించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్, భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్.