Asianet News TeluguAsianet News Telugu

SRHvsDC: సన్‌రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ టై... ఐపీఎల్ 2021 సీజన్‌లో మొదటి సూపర్ ఓవర్ మ్యాచ్...

IPL 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కి పర్ఫెక్ట్ మజాను అందించింది. ఆఖరి ఓవర్ ఆఖరి బంతిదాకా సాగిన మ్యాచ్‌ టైగా ముగిసి, ఐపీఎల్ 2021 సీజన్‌లో మొట్టమొదటి సూపర్ ఓవర్ మ్యాచ్‌గా మారింది.

SunRisers Hyderabad vs Delhi cApitals match tied, first super over in IPL 2021 CRA
Author
india, First Published Apr 25, 2021, 11:24 PM IST

160 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి శుభారంభం దక్కలేదు. 8 బంతుల్లో 6 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ రనౌట్ అయ్యాడు. 28 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది సన్‌రైజర్స్.
అయితే మంచి ఫామ్‌లో ఉన్న జానీ బెయిర్ స్టో 18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 38 పరుగులు చేసి... ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

టూ డౌన్‌లో బ్యాటింగ్‌కి విరాట్ సింగ్ పరుగులు చేయడానికి బాగా ఇబ్బంది పడ్డాడు. 14 బంతుల్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసి... ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో స్టోయినిస్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుపున తొలి బ్యాటింగ్ చేసిన కేదార్ జాదవ్, 9 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసి అమిత్ మిశ్రా బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు.

6 బంతుల్లో 5 పరుగులు చేసిన అభిషేక్ శర్మను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన అక్షర్ పటేల్, ఆ తర్వాతి బంతికే రషీద్ ఖాన్‌ను డకౌట్ చేశాడు. వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది సన్‌రైజర్స్‌.
విజయ్ శంకర్ 7 బంతుల్లో 8 పరుగులు చేసి ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.

అయితే వస్తూనే రెండు ఫోర్లు బాదిన జగదీశ్ సుచిత్, ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు కావాల్సిన పరిస్థితికి తీసుకొచ్చాడు. తొలి బంతికే ఫోర్ బాదిన కేన్ విలియంసన్, రెండో బంతికి సింగిల్ తీయగా.... మూడో బంతికి సుచిత్ సిక్సర్ బాదాడు. ఆ తర్వాత మూడు బంతుల్లో మూడు సింగిల్స్ మాత్రమే రావడంతో మ్యాచ్ టైగా ముగిసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios