హాఫ్ సెంచరీ చేసిన కేన్ విలియంసన్...ఆఖరి ఓవర్ దాకా సాగిన మ్యాచ్...వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...నాలుగో స్థానానికి పరిమితమైన ఆర్‌సీబీ...ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో సెకండ్ క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడనున్న సన్‌రైజర్స్...
IPL 2020 సీజన్‌లో వరుసగా నాలుగో విజయంతో రెండో క్వాలిఫైయర్‌కి దూసుకెళ్లింది సన్‌రైజర్స్ హైదరాబాద్. మూడేళ్ల గ్యాప్ తర్వాత ప్లేఆఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగో స్థానంతోనే సరిపెట్టుకుంది.
132 పరుగుల స్వల్ప టార్గెట్ అయినప్పటికీ సన్‌రైజర్స్ వరుస వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ చివరి ఓవర్‌దాకా ఉత్కంఠగా సాగింది. అయితే ‘మిస్టర్ కూల్’ కేన్ విలియంసన్ అద్భుత ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. 132 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదటి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. సాహా స్థానంలో జట్టులోకి వచ్చిన యంగ్ బ్యాట్స్‌మెన్ శ్రీవాత్సవ గోస్వామి డకౌట్ అయ్యాడు.
డేవిడ్ వార్నర్ 17 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేయగా... మనీశ్ పాండే 21 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్స్‌తో 24 పరుగులు చేశాడు. ప్రియమ్ గార్గ్ కూడా 7 పరుగులకే అవుట్ కావడంతో 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయితే కేన్ విలియంసన్, జాసన్ హోల్డర్‌తో కలిసి అద్భుత భాగస్వామ్యం నెలకొల్పాడు.
విలియంసన్ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకోగా హోల్డర్ వరుస బౌండరీలతో మ్యాచ్‌ను ముగించాడు. కేన్ విలియంసన్ 44 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేయగా హోల్డర్ 20 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో సిరాజ్ రెండు వికెట్లు తీయగా ఆడమ్ జంపా, చాహాల్‌కి చెరో వికెట్ దక్కింది. వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడి, ఐపీఎల్ 2020 సీజన్‌ను నాలుగో స్థానంతో ముగించింది విరాట్ కోహ్లీ జట్టు.
