Asianet News TeluguAsianet News Telugu

దొంగ ఎలుకలు... నా క్యాప్ కొరికేశాయి! బొక్కలు పడిన టోపీ పెట్టుకుని వచ్చిన స్టీవ్ స్మిత్...

టెస్టు సిరీస్ విజయం తర్వాత చిల్లులు పడిన క్యాప్‌తో కనిపించిన స్టీవ్ స్మిత్... డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలుకలే ఇంత పని చేశాయంటూ కామెంట్... 

Steven Smith special story about his ragged green test cap after West Indies vs Australia
Author
First Published Dec 13, 2022, 3:53 PM IST

సాండ్ పేపర్ బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా టెస్టు కెప్టెన్సీ కోల్పోయి, ఏడాది బ్యాన్ అనుభవించిన ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్... ప్రస్తుతం ఆసీస్‌కి టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ గాయపడి, జట్టుకి దూరమైన రెండు సందర్భాల్లో కెప్టెన్‌గా టీమ్‌ని మళ్లీ నడిపించాడు కూడా...

ప్రస్తుతం వెస్టిండీస్‌తో కలిసి టెస్టు సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా జట్టు, తొలి రెండు టెస్టుల్లో ఘన విజయాలు అందుకుంది. ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్సీలో మొదటి టెస్టులో పరుగుల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా, స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో జరిగిన రెండో టెస్టులో 419 పరుగుల భారీ తేడాతో ఘన విజయం అందుకుంది...

ఆసీస్ తాత్కాలిక కెప్టెన్‌గా టెస్టు సిరీస్ విజయం తర్వాత ట్రోఫీ అందుకునే సమయంలో స్టీవ్ స్మిత్ ధరించిన చిల్లుల టోపీ అందరి దృష్టిని ఆకర్షించింది. పాతబడిపోయిన,చెత్త కుప్పలో పడేసిన దాన్ని వెతికి మరీ పెట్టుకొచ్చినట్టుగా ఉన్న ఆ టోపీ గురించి చాలా ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు స్టీవ్ స్మిత్...
 

‘గాలే డ్రెస్సింగ్ రూమ్‌లో ఎప్పటిలాగే నా టోపీ పెట్టి వెళ్లిపోయాను. తర్వాతి రోజు వచ్చి చూద్దును కదా... ఎలుకలు దూరినట్టున్నాయి. అందుకే ఈ టోపీ ఇలా తయారైంది. వచ్చే వారం దీన్ని బాగు చేయిస్తాను... అంతేకానీ పడేయను...’ అంటూ చెప్పుకొచ్చాడు స్టీవ్ స్మిత్...

2010లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన స్టీవ్ స్మిత్, వెస్టిండీస్‌తో జరిగిన మొది టెస్టులో 200 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితే కెప్టెన్‌గా ఆడిన రెండో టెస్టులో మాత్రం తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు స్మిత్. రెండో ఇన్నింగ్స్‌లో 35 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ముగించుకున్న ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడబోతోంది. స్వదేశంలో జరిగే ఈ మూడు టెస్టుల సిరీస్, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ చేరే జట్లపై ఓ క్లారిటీ తీసుకురానుంది. సౌతాఫ్రికాను స్వదేశంలో ఆస్ట్రేలియా 2-0 లేదా 3-0 తేడాతో ఓడించగలిగితే... డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది...

అదే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాని ఓడిస్తే మాత్రం సీన్ ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా, టాప్‌లోకి చేరుకుంటుంది. దీంతో మూడో స్థానంలో ఉన్న శ్రీలంక, నాలుగో స్థానంలో ఉన్న టీమిండియా ఛాన్సులు మెరగవుతాయి...

జో రూట్ కెప్టెన్సీలో 12 టెస్టులు ఆడి రెండే రెండు విజయాలు అందుకుని, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో ఆఖరి పొజిషన్‌లో ఉన్న ఇంగ్లాండ్... బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో వరుస విజయాలతో టాప్ 5లోకి దూసుకొచ్చింది. అయితే ఫైనల్ చేరాలంటే మాత్రం ఇంగ్లాండ్‌కి అవకాశాలు తక్కువే. 

పాక్‌తో జరిగే ఆఖరి టెస్టుతో పాటు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో జరిగే రెండు టెస్టుల్లో గెలవగలిగితే ఇంగ్లాండ్ ఫైనల్ రేసులో నిలవగలదు. అయితే ఫైనల్ చేరాలంటే మాత్రం టాప్ 4లో ఉన్న జట్లు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇండియాల్లో రెండు జట్లు వరుస పరాజయాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios