సారాంశం

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ సమయంలో రేప్ కేసులో దనుష్క గుణతిలకను అరెస్ట్ చేసిన సిడ్నీ పోలీసులు... గుణతిలకపై నమోదైన నాలుగు కేసుల్లో మూడింటిని కొట్టేసిన న్యాయస్థానం.. 

శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలకకు రేప్ కేసులో ఊరట లభించింది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన శ్రీలంక బ్యాటర్ దనుష్క గుణతిలక, అక్కడ ఓ యువతిపై అత్యాచారం చేశాడంటూ కేసు నమోదైంది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న సిడ్నీ పోలీసులు, గుణతిలకపై రేప్ కేసుతో పాటు నాలుగు కేసులు నమోదు చేశారు..

వీటిల్లో మూడు కేసులను కొట్టి వేస్తూ నిర్ణయం తీసుకుంది సిడ్నీ కోర్టు. పోలీసుల కథనం ప్రకారం డేటింగ్ యాప్‌ ద్వారా ఓ 29 ఏళ్ల యువతిని కలిసిన దనుష్క గుణతిలక, ఆమెతో డేట్‌కి వెళ్లాడు. ఆ తర్వాత సిడ్నీ రోజ్ బేలో ఉన్న ఆమె ఇంటికి వెళ్లి గుణతిలక, యువతిపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు...

ఇందులో మూడు ఆరోపణలను కొట్టేసిన సిడ్నీ కోర్టు, ఓ కేసులో మాత్రం విచారణను నిర్వహించబోతున్నారు. బలవంతంగా సెక్స్ చేసేందుకు ప్రేరేపించాలని ప్రయత్నించిన గుణతిలక, ఆమె గొంతును 20- 30 సెకన్ల పాటు పట్టుకుని, ఉక్కిరి బిక్కిరి చేశాడనే ఆరోపణలను ఇంకా కొట్టివేయలేదు న్యాయస్థానం. గుణతిలక చేసిన ఈ పనికి, ఆ యువతి 6 సెకన్ల పాటు శ్వాస కూడా తీసుకోలేకపోయిందని, బలవంతంగా అతని చేతిని విడిపించుకున్నాకే ఆమె ప్రాణం తిరిగి వచ్చినట్టు ఫీల్ అయినట్టు పోలీసులకు తెలిపింది..

గుణతిలక వల్ల తన ప్రాణానికి ముప్పు ఉందని బయపడుతున్నట్టు పోలీసులకు తెలిపిన ఆ యువతి, పోలీసు రక్షణ కోరుతోంది. అయితే ఏడు నెలల విచారణ తర్వాత గుణతిలకపై రేప్ కేసు కొట్టివేయడానికి కారణాలు ఏంటి? నిజంగా అతను బలవంతంగా అత్యాచారం చేయలేదా? ఆ యువతి, కావాలనే లంక క్రికెటర్‌పై నిందలు వేసిందా? లేక ఆమెకు నష్టపరిహారం ఇచ్చి కేసులను విత్ డ్రా చేసుకునేలా సంధి కుదుర్చుకున్నాడా? అనే విషయాలు తెలియరాలేదు...

శ్రీలంక తరుపున 8 టెస్టులు, 47 వన్డేలు, 46 టీ20 మ్యాచులు ఆడిన దనుష్క గుణతిలక, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు.

అయితే నమీబియాతో మ్యాచ్ తర్వాత గుణతిలక గాయంతో మిగిలిన మ్యాచులకు దూరమయ్యాడు. 2021లో ఇంగ్లాండ్ టూర్‌లో బయో బబుల్ నిబంధనలను అతిక్రమించి, అర్ధరాత్రి బయట తిరుగుతూ దొరికిపోయిన దనుష్క గుణతిలక, ఏడాది పాటు నిషేధాన్ని కూడా ఎదుర్కొన్నాడు..

రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కోవడంతో దనుష్క గుణతిలకను 8 నెలల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది లంక క్రికెట్ బోర్డు. అంతకుముందు 2018లో టీమ్ కర్ఫ్యూని ఉల్లంఘింిన గుణతిలక,ఆరో నెలల పాటు నిషేధానికి గురయ్యాడు.. 

ఐర్లాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ గెలిచిన శ్రీలంక క్రికెట్ జట్టు, వచ్చే నెలలో ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.