Asianet News TeluguAsianet News Telugu

SRHvsRCB: డేవిడ్ వార్నర్‌ రనౌట్... వెంటాడిన బ్యాడ్‌లక్...

బెంగళూరుపై డేవిడ్ వార్నర్‌కు మంచి రికార్డు...

గత 8 మ్యాచుల్లో ఏడు సార్లు హాఫ్ సెంచరీకి పైగా స్కోరు చేసిన వార్నర్...

దురదృష్టవశాత్తు రనౌట్...

SRH vs RCB: SRH Captain David warner Run-out by Bad luck CRA
Author
India, First Published Sep 21, 2020, 10:02 PM IST

IPL 2020: ఐపీఎల్‌లో అదరగొట్టే కెప్టెన్ డేవిడ్ వార్నర్ దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యి వెనుదిరిగాడు. తాను ఎదుర్కొన్న రెండో బంతినే బౌండరీకి పంపించిన వార్నర్, మంచి ఫామ్‌లో ఉన్నట్టు కనిపించాడు. అయితే ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో బెయిర్ స్టో స్టైయిట్ డ్రైవ్ ఆడాడు. బంతిని ఆపేందుకు చేతిని అడ్డు పెట్టాడు ఉమేశ్ యాదవ్. ఉమేశ్ చేతిని ముద్దాడిన బంతి, నేరుగా వెళ్లి వికెట్లను తాకింది.

సింగిల్ తీసేందుకు డేవిడ్ వార్నర్, క్రీజులో నుంచి బయటికి రావడంతో రనౌట్ అయ్యాడు. నిరాశగా ఎదురుతిరిగాడు డేవిడ్ వార్నర్. ప్రతీ సీజన్‌లో అదరగొట్టే డేవిడ్ వార్నర్‌కు ఈ సారి మొదటి మ్యాచ్‌లోనే బ్యాడ్ లక్ వెంటాడింది. గత సీజన్‌లో బెంగళూరుపై అజేయ సెంచరీ చేసిన డేవిడ్ వార్నర్‌కి ఆర్‌సీబీపై ఇదే లో స్కోర్.

ఇంతకుముందు ఏడు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ చేసిన వార్నర్... ఒక్క మ్యాచ్‌లో మాత్రమే 14 పరుగులకు అవుట్ అయ్యాడు. నేడుగా బ్యాడ్ లక్‌ కారణంగా 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios