ఈ జట్టు ఓనర్ కావ్య మారన్ కి నిరాశ మాత్రం తప్పడం లేదు. తాజాగా.. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ తో సన్ రైజర్స్ తలపడిన విషయం మనకు తెలిసిందే.

ఐపీఎల్ లో సన్ రైజర్స్ జట్టుకి కొన్ని సంవత్సరాలుగా లక్ కలిసిరావడం లేదనే చెప్పాలి. నిజానికి.. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మంచి రికార్డు ఉంది. రెండు సార్లు ఫైనల్ చేరిన సన్‌రైజర్స్, 2016లో టైటిల్ విజేతగా నిలిచింది. ఐదుసార్లు ప్లేఆఫ్స్ చేరిన సన్‌రైజర్స్... గత రెండు సీజన్లలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సీజన్‌ని కూడా ఘోర పరాజయంతో మొదలెట్టింది.

ఈ ఏడాది టీమ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ... పర్ఫామెన్స్ లో మాత్రం ఎలాంటి మార్పులేదు. దీంతో... ఈ జట్టు ఓనర్ కావ్య మారన్ కి నిరాశ మాత్రం తప్పడం లేదు. తాజాగా.. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ తో సన్ రైజర్స్ తలపడిన విషయం మనకు తెలిసిందే.

Scroll to load tweet…

ఈ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో లక్నో జట్టు చాలా తొందరగా వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ లో ఇంపాక్ట్ ప్లేయర్ ఫరుకీ వేసిన బంతిని ఆడే క్రమంలో లక్నో డేంజర్ బ్యాటర్ కైల్ మేయర్స్ మయాంక్ అగర్వాల్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. సన్ రైజర్స్ కి అనుకూలంగా ఏది జరిగినా, ఔట్ అయినా.. వెంటనే కెమేరామెన్ కావ్య ఫేస్ మీద ఫోకస్ పెడుతూ ఉంటాడు. లక్నో బ్యాట్స్ మెన్ అవుట్ అయిన వెంటనే కావ్య ఫేస్ మీద క్లోజప్ వేశారు. ఆ సమయంలో ఆమె ఆనందానికి అవదులు లేవు. చాలా సంతోషపడింది. కుర్చీలో నుంచి లేచి మరీ గట్టిగా అరుస్తూ కేరింతలు కొట్టింది. ఆమె ఆనందం చూసి కావ్య ఫాన్ మామూలుగా ఖుషీ అవ్వలేదు. అయితే.. ఆ ఆనందం చివరి వరకూ లేదు. మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓటమి పాలైంది. ఇంకేముంది కావ్య మళ్లీ నిరాశకు గురవ్వాల్సి వచ్చింది.

Scroll to load tweet…

అయితే.. నెటిజన్లు కావ్య సంతోషంగా ఫీలైన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ... ఒక్క ఔట్ కి ఇంత ఆనందపడిందంటే...మ్యాచ్ గెలిస్తే.. ఇంకెంత ఆనందపడేదో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.