విజయ్ శంకర్... టీమిండియా తరుపున ఆడింది తక్కువ మ్యాచులే అయినా వన్డే వరల్డ్‌కప్‌కి ఎంపికై సంచలనం క్రియేట్ చేశాడు. వన్డే విశ్వకప్‌లో వేసిన తొలి బంతికే వికెట్ తీసి, అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో మనోడు పెద్దగా అదిరిపోయే ప్రదర్శన ఇచ్చింది ఏమీ లేకపోయినా... ఓ అద్భుతమైన రికార్డు మాత్రం తనపేరిటే ఉందంటున్నాడు విజయ్ శంకర్. 

‘ఐపీఎల్‌లో డకౌట్ కాకుండా 29 ఇన్నింగ్స్‌లు బ్యాటింగ్ చేశాను. ఇప్పటిదాకా ఏ భారత క్రికెటర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు...’ అంటూ తన రికార్డు గురించి చెప్పుకొచ్చిన విజయ్ శంకర్, ఆసీస్ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ తర్వాత డకౌట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా ఉన్నాడు.

ఇంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడిన విజయ్, ఆ జట్టుపై ఆడి తన సత్తా నిరూపించుకోవాలని కసిగా ఎదురుచూస్తున్నాడట.