టీమిండియా బౌలర్ కేరళ స్పీడస్టర్‌ శ్రీశాంత్‌ ఏడేళ్ల తర్వాత మైదానంలో తన సత్తా చాటాడు. ఏడేళ్ల  నిషేధం పూర్తి చేసుకొని ముస్తాక్‌ అలీ ట్రోపీతో రీఎంట్రీ ఇచ్చాడు. తొలి మ్యాచ్‌లోనే వికెట్‌ పడగొట్టిన శ్రీశాంత్‌.. తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసి 29 పరుగులిచ్చి ఒక వికెట్‌ దక్కించుకున్నాడు. ఆ ఆనంద సమయంలో కన్నీరు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను శ్రీశాంత్‌ స్వయంగా ట్విటర్‌లో పంచుకున్నాడు. 

ఈ సందర్భంగా శ్రీకాంత్ .. చీకటి రోజులు ముగిసిన తర్వాత ఆడుతున్నమొదటి మ్యాచ్ ఇన్నాళ్లు అభిమానులు నాపై చూపించిని ప్రేమ, అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని దేవుడిని కోరుకుంటున్నా అంటూ శ్రీశాంత్ ట్వీట్‌ చేశాడు. 

 

2005లో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీశాంత్‌ టీమిండియా తరపున 27 టెస్టులు, 57 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. 2013 ఐపీఎల్‌ సీజన్‌ సందర్భంగా స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అప్పట్లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ఆడుతున్న శ్రీశాంత్‌ తన సహచర క్రికెటర్లైన అంకిత్‌ చవాన్‌, అజిత్‌ చండీలాతో కలిసి బుకీలను కలిసినట్లు తేలడంతో బీసీసీఐ శ్రీశాంత్‌తో పాటు మిగతా ఇద్దరి ఆటగాళ్లపైన జీవితకాల నిషేదం విధించింది.