దక్షిణాఫ్రికా క్రికెటర్ కొలిన్ అక్రమాన్ టీ20 క్రికెట్లో ఓ అరుదైన రికార్డును నమోదుచేశాడు. బ్యాట్స్ మెన్స్ ఆధిపత్యం కొనసాగే పొట్టి క్రికెట్ ఫార్మాట్ బంతితో కూడా అద్భుతాలు సృష్టించవచ్చని ఈ 28ఏళ్ల స్పిన్నర్ నిరూపించాడు. ఇలా విటలిటీ బ్లాస్‌ టీ20 లీగ్‌లో అతడి మణికట్టు మాయాజాలం కొనసాగింది. టీ20 ఫార్మాట్ లో దిగ్గజ బౌలర్లకు కూడా సాధ్యం కాని గణాంకాలను అక్రమాన్ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. 

విటిలిటీ బ్లాస్ట్ టీ20 లీగ్ లో అక్రమాన్ లిసెస్టర్ కొలిన్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే బుధవారం అతడి సారథ్యంలోరి జట్టు వార్విక్ షైర్ టీంతో తలపడింది. ఈ మ్యాచ్ లో అక్రమన్ హవా కొనసాగింది. ప్రత్యర్థి జట్టును తన స్పిన్ బౌలింగ్ తో బెంబేలెత్తించిన అక్రమాన్ ఏకంగా ఏడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ అద్భుత ప్రదర్శనతో అతడు టీ20 క్రికెట్ చరిత్రలో ఓ కొత్త రికార్డును నెలకొల్పాడు. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లిసెస్టర్ షైర్ నిర్ణీత ఓవర్లలో 189 పరుగులు చేసింది. అయితే 190 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన వార్విక్‌షైర్‌  అక్రమన్ ఉచ్చులో చిక్కుకుంది. అతడి విజృంభణతో కేవలం 20 పరుగుల వ్యవధిలోనే ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి ఓటమిని చవిచూసింది. అయితే మిడిల్ ఓవర్లలో   సామ్ హైన్(61), ఆడమ్ హోస్(34) పోరాడటంతో ఆ జట్టు కనీసం 134 పరుగులు చేయగలిగింది. ఇలా 17.4 ఓవర్లలోనే వార్విక్ షైర్ జట్టును కుప్పకూల్చి అక్రమన్ సేన ఘన విజయం సాధించింది.