కోల్ కతా: వార్షిక కాంట్రాక్టు జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరు లేకపోవడంపై మాట్లాడేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నిరాకరించారు. బీసీసీఐ విడుదల చేసిన వార్షిక కాంట్రాక్టు జాబితాలో ధోనీకి చోటు దక్కకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసిందంటూ ప్రచారం సాగుతోంది. 

మూడు ఐసీసీ టోర్నీలు అందించిన ధోనీకి బిసిసిఐ ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ కొంత మంది మండిపడుతున్నారు. ఈ విషయంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాలని కొంత మంది కోరుతున్నారు. ఈ క్రమంలోనే ఓ సమావేశానికి హాజరైన సౌరవ్ గంగూలీకి ధోనీ విషయంపై ప్రశ్నల వర్షం కురిపించారు. 

Also Read: బీసీసీఐ కాంట్రాక్టు ఝలక్: సర్ ప్రైజ్ ఇచ్చిన ఎంఎస్ ధోనీ

ధోనీకి వార్షిక కాంట్రాక్టు జాబితాలో చోటు కల్పించకపోవడంపై తాను మాట్లాడబోనని గంగూలీ చెప్పారు. దాంతో ధోనీ కేరీర్ కు ముగింపు పలకడానికి బాగానే వర్క్ జరిగిందని క్రీడావిశ్లేషకులు అంటున్నారు. ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోనీ ఆడనున్నాడు. 

ఐపిఎల్ ప్రదర్శన ఆధారంగానే ధోనీ టీమిండియా తరఫున ఆడుతాడా లేదా అనేది తేలుతుందని అంటున్నారు. అంతేకాకుండా టీ20 ప్రపంచ కప్ జట్టులో ధోనీ ఉంటాడా, లేదా అనేది కూడా దానిపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. 

Also Read: ధోనీ ఖేల్ ఖతమ్: తేల్చేసిన బీసీసీఐ, తెలుగు క్రికెటర్ ఒకే ఒక్కడు

అయితే, ధోనీ ఇక టీమిండియా తరఫున ఆడుతాడనేది కల్ల అని భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ఐపిఎల్ లో ధోనీ సక్సెస్ అవుతాడని, ధోనీ ప్రతి మ్యాచులోనూ వంద శాతం ప్రదర్శన చేయాలని అనుకుంటాడని ఆయన అన్ాడు. ఐపిఎల్ లో రాణించనంత మాత్రాన టీమిండియాలో చోటు దక్కుతుందని భావించలేమని అన్నాడు.