రిషబ్ పంత్ కు కేఎల్ రాహుల్ ఎసరు: గంగూలీ స్పందన ఇదీ...
న్యూజిలాండ్ మీద జరిగిన తొలి టీ20 మ్యాచులో రిషబ్ పంత్ కు తుది జట్టులో స్తానం దక్కకపోవడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. కేఎల్ రాహుల్ పరిమిత ఓవర్ల క్రికెట్ లో బాగా రాణిస్తున్నాడని గంగూలీ అన్నారు.
ముంబై: పరిమిత ఓవర్ల క్రికెట్ లో టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ చేసిన అద్భుత ప్రదర్శనను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కొనియాడాడు. టెస్టు మ్యాచుల్లోనూ రాహుల్ ఇదే ఫామ్ ను కొనసాగించాలని ఆయన అభిప్రాయపడ్డారు. జట్టు యాజమాన్యం ప్రస్తుతం ఇచ్చిన ప్రతి పాత్రను రాహుల్ సమర్థంగా పోషిస్తున్నాడని అన్నాడు.
బ్యాట్స్ మెన్ గా ఏ స్థానంలో అవకాశం కల్పించినా పరుగులు చేస్తున్నాడు. ఓపెనర్ గానే కాకుండా మిడిల్ ఆర్డర్ లోనూ అతను పరుగులు పిండుకుంటున్నాడు. వికెట్ కీపింగ్ లోనూ రాణిస్తున్నాడు. ఈ స్థితిలో న్యూజిలాండ్ పై జరిగిన తొలి టీ20లో రిషబ్ పంత్ కు తుది జట్టులో స్థానం లభించకపోవడంపై గంగూలీ స్పందించారు.
Also Read: నేను దాన్ని ప్రేమిస్తున్నా, ఆనందిస్తున్నా: కేఎల్ రాహుల్
కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ నిర్ణయం తీసుకున్నాడని, కేఎల్ రాహుల్ పాత్రను జట్టు యాజమాన్యమూ కెప్టెన్ నిర్ణయిస్తారని దాదా చెప్పారు. వన్డేలు, టీ20ల్లో రాహుల్ చాలా బాగా ఆడుతున్నాడని, టెస్టు క్రికెట్ కూడా బాగా ఆడేవాడని, ఆ తర్వాత మందగించాడని ఆయన అన్నారు.
పరిమిత ఓవర్ల క్రికెట్ లో మాత్రం విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడని, అతడి ఈ విధంగానే కొనసాగాలని కోరుకుంటున్నానని గంగూలీ అన్నారు అయితే ముందే చెప్పినట్లు ఈ నిర్ణయాలన్నీ జట్టు యాజమాన్యం తీసుకుంటుందని చెప్పారు
Also Read: మ్యాచ్ రివ్యూ: వరల్డ్ కప్ ముంగిట ఎన్నెన్నో ప్రశ్నలు... అన్నింటికి లభించిన సమాధానాలు
టీ20 ప్రపంచ కప్ టోర్నీకి వికెట్ కీపింగ్ రేసులో ఎవరుంటారని ప్రశ్నిస్తే.. సెలెక్టర్లు, విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి ఆ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. వారేం అనుకుంటే అదే జరుగుతుందని గంగూలీ చెప్పారు.
వికెట్ కీపర్ గా తాను ఆనందిస్తున్నానని కేఎల్ రాహుల్ ఇంతకు ముందు చెప్పాడు. నిజాయితీగా తాను దాన్ని ప్రేమిస్తున్నానని చెప్పాడు.