ఉమెన్స్ ఆర్‌సీబీ టీమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన... ఆర్‌సీబీ మెన్స్ టీమ్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత సారథి ఫాఫ్ డుప్లిసిస్‌లతో ఉమెన్స్ టీమ్ కెప్టెన్‌ని పరిచయం చేయించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. 

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ (డబ్ల్యూపీఎల్) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా స్మృతి మంధానని ఎంపిక చేసింది టీమ్ మేనేజ్‌మెంట్. మొట్టమొదటి డబ్ల్యూపీఎల్ వేలంలో రూ.3 కోట్ల 40 లక్షలకు స్మృతి మంధానని కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో మొట్టమొదట వేలానికి వచ్చిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన స్మృతి మంధాన, తొలి సీజన్‌లో అత్యధిక మొత్తం దక్కించుకున్న ప్లేయర్‌గానూ నిలిచింది..


సోషల్ మీడియా అకౌంట్‌ ద్వారా స్మృతి మంధానని, ఆర్‌సీబీ కెప్టెన్‌గా నియమిస్తున్నట్టుగా ప్రకటించారు మెన్స్ ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్... 

Scroll to load tweet…

‘నేను మీ జెర్సీ నెంబర్ 18ని. ఈరోజు ఓ స్పెషల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. ఆర్‌సీబీని కెప్టెన్‌గా 9 సీజన్ల పాటు నడిపించడం నా కెరీర్‌లో ఎప్పటికీ మరిచిలేని అనుభూతులను మిగిల్చింది...

కెప్టెన్‌ కేవలం గ్రూప్‌కి లీడర్ మాత్రమే కాదు, టీమ్ కల్చర్‌ని క్రియేట్ చేసే పర్సన్ కూడా. ఆర్‌సీబీని ఫాఫ్ డుప్లిసిస్ గత సీజన్‌లో అద్భుతంగా నడిపించాడు. తన చుట్టూ ఉన్న ప్రతీ ప్లేయర్‌ని తనతో పాటు నడిపించి ముందుకు తీసుకెళ్లాడు... నేను ఫాఫ్ డుప్లిసిస్ కెప్టెన్సీలో ఆడడాన్ని పూర్తిగా ఎంజాయ్ చేశాను...’ అని చెప్పాడు విరాట్ కోహ్లీ...

విరాట్, ఫాఫ్ పేరు చెప్పగానే డుప్లిసిస్ వచ్చాడు... ‘హాయ్ ఆర్‌సీబీ ఫ్యాన్స్. నేను మీ లీడర్‌ని. ఆర్‌సీబీ ఉమెన్స్ టీమ్‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మొట్టమొదటి సీజన్‌లో ఆర్‌సీబీ కెప్టెన్‌ని పరిచయం చేయబోతున్నాం. 

ఆర్‌సీబీని నడిపించడం చాలా గొప్ప గౌరవం. ఈ ఫ్రాంఛైజీలో ఓ మ్యాజిక్ ఉంది, ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ఎందరో గొప్ప ప్లేయర్లు ఈ ఫ్రాంఛైజీకి ఆడారు. ఇంకా ఆర్‌సీబీ ఫ్యాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లే మా బలం...’ అంటూ చెప్పాడు ఫాఫ్ డుప్లిసిస్...

‘ఇక ఇప్పుడు ఇంకో జెర్సీ నెంబర్ 18, ఆర్‌సీబీని నడిపించనుంది. స్మృతి మంధాన... గో వెల్ స్మృతి... బెస్ట్ టీమ్‌ నీ దగ్గరుంది... బెస్ట్ ఫ్రాంఛైజీని బెస్ట్‌గా నిలుపు... ’ అని విరాట్ చెప్పగా.. ‘ఆల్ ది బెస్ట్ స్మృతి...’ అంటూ ఫాఫ్ డుప్లిసిస్ ముగించాడు...

‘హాయ్ నేను స్మృతి మంధాన... ఉమెన్స్ ఆర్‌సీబీ కెప్టెన్‌ని. ఆర్‌సీబీని నడిపించే బాధ్యత దక్కడం చాలా గొప్ప ఫీలింగ్. విరాట్, ఫాఫ్.. ఇద్దరూ కూడా ఆర్‌సీబీని నడిపించడం గురించి చాలా చెప్పారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్‌కి స్పెషల్ థ్యాంక్స్...’ అంటూ చెప్పుకొచ్చింది స్మృతి మంధాన..