కరోనా మహమ్మారి భారత్ కి  అతలాకుతలం చేసేస్తోంది. ఈ మహమ్మారి కన్ను పడకుండా ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ అన్ని ప్రయత్నాలు చేసింది. కానీ.. దాదాపు నలుగురు క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు. దీంతో.. చేసేది లేక.. ఐపీఎల్ ని నిరవధిక వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో.. క్రికెటర్లంతా.. తమ ఇళ్లకు పయనమయ్యారు. వారిలో విదేశీ క్రికెటర్లు సైతం ఉన్నారు.

ఈ పరిస్థితిపై కివీస్ మాజీ క్రికెటర్ కామెంటేటర్ సైమన్ డౌల్ స్పందించాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వదిలి వెళ్తున్నందుకు భారతీయులు తనను క్షమించాలని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ డౌల్ ట్వీట్ చేశాడు. కరోనా సంక్షోభం కారణంగా ఐపీఎల్‌ను బీసీసీఐ అనూహ్యంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో విదేశీ ఆటగాళ్లు, ఇతర సిబ్బంది తమ తమ స్వదేశాలకు బయల్దేరారు. 

 

బుధవారం స్వదేశానికి పయనమైన న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్‌ సైమన్ డౌల్ ..భారత ప్రజలను ఉద్దేశించి ఓ భావోద్వేగ ట్వీట్‌ చేశాడు. `ప్రియమైన భారతీయులు.. మీరు ఎన్నో సంవత్సరాలుగా నాకు చాలా ఇచ్చారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మిమ్మల్ని విడిచి వెళ్తున్నందుకు నన్ను క్షమించండి. దయచేసి మీరు సురక్షితంగా ఉండటానికి చేయదగినది చేయండి. పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు జాగ్రత్తగా ఉండండ`ని ట్వీట్ చేశాడు.